పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ముదురుతున్న వరి వివాదం పార్లమెంట్‌ను తాకింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ ఎంపీలు గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు చేయకుండా జాప్యం వహిస్తుందన్నారు. ప్రధాని యాసంగి వరిని కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కట్టిందన్నారు. వరి కొనుగోలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఎంపీలు తెలిపారు. పంజాబ్‌లో వరి సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణలో మాత్రం సేకరించకపోవడం ఏంటని ప్రశ్నించారు. పంజాబ్‌లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరిస్తుందని ఎంపీ కేశవరావు మండిపడ్డారు. కేంద్రం స్పందించి రాష్ట్రంలో ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఢిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు వరి ధాన్యంపై పార్లమెంట్‌లో స్పందించకపోవడం లేదని… రాష్ట్రంలో మాత్రం తమ ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తున్నట్లు ప్రజలకు మాయ మాటలు చెప్పుతున్నారన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఒక విధంగా.. ఢిల్లీలో మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్ వ్యూహం ఫలించిందా ?

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు…

సీఎం కేసీఆర్ వ్యూహ రచన

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -