శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్…

- Advertisement -

ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం ఆడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్‌కు వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందు RTPCR టెస్ట్‌లు చేసుకోవాలని ఆ టెస్ట్‌లో వారికి నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు విమానాశ్రయంలో దిగిన తర్వాత మరోసారి అధికారులు పరీక్షలు చేస్తారని, అందులో కూడా నెగిటివ్‌ వస్తేనే దేశంలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వం ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించనుంది

- Advertisement -

ప్రయాణికులకు టెస్ట్‌ల కోసం రెండు ప్రత్యేక కేంద్రాను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. దక్షిణాఫ్రికా, జింబాంబ్వే, నవీబియా, మోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RTPCR పరీక్షలు తప్పని సరి చేసింది.

మరో ముప్పు ముంచుకొస్తుంది

రెడ్ అలర్ట్…. ఏపీ,తమిళనాడుకి భారీ వర్షం !

మహారాష్ట్ర అలర్ట్ కొవిడ్ కొత్త వేరియంట్‌..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -