Thursday, May 2, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ వ్యూహ రచన

- Advertisement -

టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు. పార్లమెంట్‌లో సమస్యలపై గట్టిగా ప్రస్తావించాలి. ఇప్పటికే చాలా ఓపికపట్టాం.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రన్ని ప్రశ్నించాలి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోడంతో… పార్లమెంట్‌లో వరి కొనుగోలు వ్యవహరాన్ని లేవనెత్తాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించారు.

ఇప్పటికే చాలా ఓపికపట్టామని, ఇక ఓపికపట్టే సమస్యే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గింజా లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకూ లోక్‌సభ, రాజ్యసభల్లో పోరాడాలన్నారు. తమకు ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, పార్లమెంట్‌లో స్వయంగా ప్రదాని దిగొచ్చి పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణలో సైతం వరి కొనుగోలు చేసేలా చట్ట సభల్లో ఎంపీలు వ్యవహరించాలన్నారు.

రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం అన్నిటికి సిద్దంగానే ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న సీఎం.. బండి సంజయ్‌కి దమ్ముంటే ప్రధాని చేత వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని ముఖ్యమంత్రి సవాల్ విసిరాడు.

కేసీఆర్ పై ఫైర్ అయిన కేంద్ర మంత్రి

సీఎం జగన్‌పై ఉండవల్లి ఫైర్..

చంద్రబాబుపై ఫైర్ బ్రాండ్ ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -