Thursday, May 2, 2024
- Advertisement -

జీతాల పై బండి ధ్వజం.. వారి పరిస్థితి దారుణం..!

- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత యువతకు మంచి ఉద్యోగావకాశాలు ఇప్పిస్తామని టీఆర్ఎస్ సర్కార్ అన్న మాట నిలబెట్టుకోలేదని.. పైగా కరోనా పరిస్థితుల తర్వాత మరింత నిరుద్యోగం పెరిగిపోయిందని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంతో మంది ఇప్పుడు ఉద్యోగవకాశాలు పొగొట్టుకొని రోడ్డున పడ్డారని అవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు లెక్చరర్లు, టీచర్లకు వెంటనే వేతనాలు చెల్లించాలని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

చైతన్యపురిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ లెక్చరర్ డా.హరినాథ్ జీతాలు లేక ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన అధ్యాపకులను జీతాలివ్వకుండా వేధించి వాళ్ల ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు.

సిబ్బంది ఇన్నాళ్లు శ్రమించడం వల్లనే కార్పొరేట్ సంస్థలు కోట్లు సంపాదించుకుని ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం అమానవీయమన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, అధ్యాపకులను మాత్రం వేతనాలు ఇవ్వకుండా వేధిస్తారా అని మండిపడ్డారు. టీచర్లు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వక పోతే ఆయా సంస్థల సిబ్బందే కార్పొరేట్ కాలేజీలను ముట్టడించే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

తెలంగాణా లో కొత్త సేవలు.. మొత్తం అక్కడ నుంచే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -