Tuesday, April 23, 2024
- Advertisement -

తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. 61 వేల ఆధిక్యంలో వైసీపీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. ఈసారి ఉప ఎన్నికల సందర్భంగా హూరా హూరీ ప్రచారాలు కొనసాగాయి. ఓ వైపు కరోనా ప్రభావం గట్టిగా ఉన్నా పోటా పోటీగా ప్రచారం చేశారు. ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు రాబోతున్నాయి. కాగా, భారీ ఆధిక్యం దిశగా ‘ఫ్యాన్‌’ దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి 61,296 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

అస్సాంలో దూసుకెళ్తున్న బీజేపీ..

వైసీపీకి 1,47,094 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 12530 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ మొదటి రౌండ్‌లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో​ 1907 ఆధిక్యంలో ఉంది. పటిష్ట భద్రత, కరోనా నిబంధనల మధ్య ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తున్న కమల్ హాసన్..

విజేత ఎవరన్నది మధ్యాహ్నంలోగా స్పష్టత రానుంది. ఇప్పటికే పార్టీలు తమ గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్‌ 17న ఉపఎన్నిక జరిగింది. వైసీపీ తరఫుణ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -