Friday, May 3, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి మరోసారి కరోనా పాజిటివ్..

- Advertisement -

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ మొదలైయింది అనిచెప్పాలి. ఇదే విషయాన్ని నిన్నటి అసెంబ్లీ చివరిరోజు సమావేశాలల్లో సీఎం వైఎస్ జగన్ కూడా తెలిపారు. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ అందుబాట్లోకి వస్తుంది అప్పటి వరకు అందరు జగ్రతగా.. అప్రమత్తంగా ఉండాలని జగన్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 630 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 97, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,71,305కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 7,024 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే గత జులైలో వైసీపీలోని కీలక నేతలందరూ వరుసగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో గుంటూర్ జిల్లా పార్టీలో ముఖ్య నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా బారిన పడ్డా విషయం తెలిసిందే. అప్పుడు హోమ్ క్వారంటైన్ కి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.

అయితే తాజాగా మరో సారి కరోనా పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ చివరి రోజునా కరోనా టెస్ట్ చెయించు కోగా అందులో రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చింది. ఇదే విశయాన్ని తన సోషల్ మీడియా కాతలో ” జులైలో నాకు కోవిద్ వచ్చి… తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే.. నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి. రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిద్ ని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను.” అంటూ పోస్ట్ చేసారు అంబటి రాంబాబుకి. త్వరగా కొలుకోవాలని కోరుకుందాం.

ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ…

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -