Thursday, May 2, 2024
- Advertisement -

వారితీరు అలా ఉంటే అక్కడ వైసీపీ మనుగడ కష్టమే..?

- Advertisement -

జగన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న వైసీపీ పార్టీ ని కొందరు తమ ఆధిపత్య రాజకీయాలకోసం వాడుకుని పార్టీ ని దిగజారుస్తున్నారని జగన్ వద్దకు చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్ని నియోజక వర్గాల పరిస్థితి ఇలా నే ఉందట. ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పార్టీ ఉందట.. దాంతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పార్టీ పరువు ప్రతిష్టలను తాకట్టుపెడుతున్నారని తెలుస్తుంది.. 2014 వరకు అక్కడ టీడీపీ నే రాజ్యమేలింది. అయితే జగన్ పుణ్యమా అని అక్కడ వేరే పార్టీ జెండా ఎగురుతుంది.

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయ్యిందో లేదో అప్పుడే వర్గ పోరు వంటి వి చేస్తూ పోతే భవిష్యత్ లో అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి అనేది పార్టీ లోని ఇతర నాయకుల మాట.. ఓ వైపు ఈ వర్గపోరు మంచి కాదని సీఎం జగన్ చెప్తున్నా నాయకులూ మాత్రం కొన్ని రోజులు ఊరుకునిమళ్ళీ పాత పద్ధతినే అవలంభిస్తున్నారు.. ఈ విషయంలో వారికి రాదు రామ కృష్ణం రాజు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. పశ్చిమ లో కాపు సామజిక వర్గం వారు సాధనంగానే ఎక్కువగా ఉంటారు..

అలాగే రాజు లు కూడా అక్కడ ఎక్కువే.. వైసీపీ గెలవడానికి కాపులతో సహా, రాజుల సహకారం కూడా వుంది. అయితే ఈ రెండు సామజిక వర్గాల మధ్య దూరం పెరిగితే పార్టీ అంతగా మంచిది కాదని జగన్ స్వయంగా సమస్య ను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నారట.. ఇక ఇప్పటికే మంత్రిగా ఉన్న రంగ‌నాథ‌రాజు తన వర్గానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆరోపణలు ఆస్థున్నాయి. డెల్టాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న ఆయ‌న ఇతర నియోజక వర్గాల్లో సైతం ఆధిపత్యం చెలాయించాలని చేస్తుండడంతో ఈ వర్గపోరు మొదలయినట్లు తెలుస్తుంది.. ఇక మంత్రి రంగ‌రాజు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఆచంట‌ ప‌క్కనే ఉన్న పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతున్నార‌ని తెలుస్తుంది.. ఇది ఇలా పోతే పార్టీ పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి జగన్ తొందరగా ఈ విషయం పై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -