Thursday, May 2, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లోకి వైఎస్ భార‌తి… పోటీ అక్క‌డ‌నుంచేనా…?

- Advertisement -

క‌డ‌ప జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు వైఎస్ జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీకీ చెక్ పెట్టాల‌ని బాబు వేస్తున్న ఎత్తుగ‌డ‌ల‌కు చెక్ పెడుతున్నారు. దానిలో భాగంగానే వైఎస్ భార‌తి త్వ‌ర‌లో జరిగే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంద‌నే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. రాజ‌కీయాల్లోకి వ‌స్తే క‌డ‌ప ఎంపీగా పోటీ చేయించాల‌ని అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

క‌డ‌ప ఎంపీగా వైఎస్ భార‌తి పోటీ వెనుక జ‌గ‌న్ భారీ వ్యూహాలే ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.ఈ సారి ఎన్నిక‌ల్లో టీడీపీనుంచి కడ‌ప ఎంపీగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క వ‌ర్గంనుంచి గెలిచిన ఆది త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. అనంత‌రం మంత్రిగా కొన‌సాగుతున్నారు.

ఆది పార్టీలో చేరిన‌ప్ప‌టినుంచి…రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య విబేధాలు బ‌య‌ట పడుతూనే ఉన్నాయి. బాబు ఎన్నిసార్లు రాజీ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా అవి స‌ఫ‌లం కావ‌డంలేదు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగునుంచి పోటీ చేయాల‌ని ఆది, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఇక్క‌డి నుంచే పోటీ చేస్తాన‌ని రామ‌సుబ్బారెడ్డి తేల్చి చెప్ప‌డంతో ఆదిని కడ‌ప ఎంపీగా పోటీ చేయించాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌డ‌ప నుంచి ఆది ఎంపీగా పోటీ చేస్తే వైసీపీకీ తీవ్ర పోఠీ ఉంటుంద‌న‌డంలో సందేహంలేదు. ప్ర‌ త్యేక హోదాకు నిర‌స‌న‌గా ఎంపీ అవినాష్ త‌న ప‌దవికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సారి అవినాష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించి భార‌తిని ఎంపీగా పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భార‌తి ఎంపీగా పోటీ చేస్తే క‌డ‌ప ప్ర‌జలు ఆమెకు వ్య‌తిరేకంగా ఓట్లు వేసె ప‌రిస్థితులు ఉండ‌వ‌ని పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అదే జ‌రిగితే వార్ వ‌న్ సైడ్ అవుతుంద‌న‌డంలే సందేహంలేదు. ఇక బాబు మార్క్ రాజ‌కీయానికి చెక్ పెట్ట‌డంతోపాటు జిల్లా వ్యాప్తంగా వైసీపీకీ అనుకూలంగా మ‌రింత ప్ర‌భావం చూప‌నుంద‌న‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -