Sunday, April 28, 2024
- Advertisement -

యాత్ర మూవీలో డైలాగ్ ను జగన్ చేసి చూపించారు..!

- Advertisement -

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అనేక ఉపన్యాసాలు ఇవ్వడం సాధ్యాసాధ్యాల తో పని లేకుండా వరాల జల్లు కురిపించడం.. కూర్చి ఎక్కాక విస్మరించడం తెలుస్తుందే. ఈ వ్యవహారం సామాన్యుడికి ప్రతి ఐదేళ్లకోసారి అలవాటైపోయిన అంశంగా మిగిలిపోయింది. దీంతో ఎన్నికల్లో నాయకుడు ఇచ్చిన హామీల విషయంలో మరీ ముఖ్యమైనవి ట్రంప్ కార్డులు ట్రబుల్ షూటర్ లాంటి కొన్నింటిని మాత్రమే ప్రభుత్వాలు హడావిడిగా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది.

అయితే ఈ విషయంలో జగన్ పద్ధతి అంత వేరే. ప్రజలకు హామీలు ఇచ్చి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఒకసారి మాట ఇచ్చాక ఇంకా ఆలోచించేది ఏమీ లేదు. జనం అడిగారా ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారా వంటివాటితో సంబంధం లేదు. అనుకున్న సమయానికి నెరవేర్చాల్సిందే అనే లెక్కలో జగన్ ముందుకు పోతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా జగన్ తీసుకుంటున్న చర్యలు అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్షాలతో పాటు పలువురిని ఉస్తుగొలుపుతున్నాయి. ఈ క్రమంలో జగన్ తాజా నిర్ణయం జనం మర్చిపోయారేమో గానీ జగన్ మాత్రం మర్చిపోలేదు కామెంట్ కు ఆస్కారం కల్పించింది. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో వర్తింప చేస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

ఈ సంగతి ఎంత మందికి గుర్తుండే ఉంటుంది.. ఆరోగ్యశ్రీ గురించి గుర్తు ఉండి ఉండొచ్చు.. కానీ ఖర్చు వెయ్యి రూపాయల దాటగానే అది ఆరోగ్యశ్రీలో చేరుపోతుందనే విషయం అప్పటికి ఎంతమంది గుర్తు పెట్టుకుంటారు తెలియదు కానీ తాను ఇచ్చిన హామీలను జగన్ మర్చిపోవడం లేదు. వాటిని గుర్తు చేయాల్సిన అవసరం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఆరోగ్యశ్రీ విస్తరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కడప కర్నూలు ప్రకాశం గుంటూరు విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో వైద్య ఖర్చులు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుంది.

మరికొన్ని రోజుల్లో మిగిలిన జిల్లాల్లో కూడా ఈ పథకం వర్తించనుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం పది వందల యాభై తొమ్మిది వైద్య ప్రక్రియ మాత్రమే ఆరోగ్యశ్రీలో వర్తింప చేసే వారు. కానీ ఈ విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన జగన్ సర్కార్ కొత్తగా మరిన్ని చేరుస్తూ మొత్తం 2059 రోగాలకు ఆరోగ్యశ్రీలో వర్తింప చేసింది. ఫలితంగా మాట ముందు ఆలోచించడమే తప్పా ఇచ్చిన తర్వాత ఆలోచించేది ఏముంది చేసుకోవడమే అని జగన్ నిరూపించటం అయిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కరోనా కష్ట కాలంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిస్తూ ఎన్నో పథకాలకు పాతర ఏస్తున్న తరుణంలో జగన్ ఇలా దూసుకుపోవడం పై యాత్ర సినిమా లోని ఈ డైలాగ్ జగన్ పాలనపై అప్లై చేస్తున్నారు జనం.

సీఎం జగన్ తో ముద్రగడ అత్యవసర భేటీ ?

వ్రైవేటులో కూడా కరోనా చికిత్స ఉచితం : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

విడుదల రజని నిర్ణయానికి జగన్ కూడా ఆశ్చర్యపోయారు..?

కరోనాతో చనిపోయినవారిపై మానవత్వం చాటిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -