Saturday, May 11, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా.. ప్రత్యర్థి కోటలో సునామీ పుట్టించిన జగన్ మాస్టర్ స్ట్రోక్

- Advertisement -

జ‘గన్’ స్ట్రోక్ టిడిపిని షేక్ చేసి పడేస్తోంది. టీఆర్ఎస్ నాయకులతో పాటు తెలంగాణాలో ఉన్న రాజకీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాయకుల అందరి మధ్యా ఇదే చర్చనీయాంశం అవుతుంది. ఇక రాజకీయాలను అనుసరించే తెలుగు ప్రజలందరూ కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పుకోవడం తప్పితే భారతరత్నతో సహా ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్న మాట నిజం. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులే ఆవేధనగా చెప్తూ ఉంటారు. నందమూరి అభిమానులను చంద్రబాబు టిడిపిలో కుక్కల్లా చూస్తున్నారని ఇప్పటికే టిడిపి నాయకులే చాలా సార్లు ఆరోపించారు. ఇక ఎన్టీఆర్‌ ఖ్యాతిని పెంచే స్థాయిలో చంద్రబాబు చేసిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు అన్న మాట నిజం.

Also Read: జ‌గ‌న్‌ ప్ర‌క‌ట‌న… టీడీపీలో ప్ర‌కంప‌న‌లు

అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేలా జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి పార్టీకి ఓటేసే జనాలు కూడా జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ బంధువులు కొంతమంది జగన్‌ని కలిసి చంద్రబాబు పాలనలో వాళ్ళు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. అదే సందర్భంలోనే ఎన్టీఆర్ అభిమానులందరూ ఆనందపడేలా తన నిర్ణయం ప్రకటించాడు జగన్. ఇప్పుడు ఈ జ‘గన్’ స్ట్రోక్‌కి సర్వత్రా ప్రశంశలు దక్కుతుంటే చంద్రబాబు క్యాంప్ మాత్రం హై బిపితో సతమతమవుతోంది. జగన్ దగ్గర ఇంకా ఇలాంటివి ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయో అని చర్చోపచర్చలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అంటూ జగన్ ఇచ్చిన స్ట్రోక్ విషయంలో కూడా ఎలా స్పందించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు బాబు అండ్ కో. ఈ విషయంపై చర్చించడానికే……ఎన్టీఆర్ జిల్లా అని జగన్ ఇచ్చిన హామీని ఎలా కౌంటర్ చేయాలి అనే విషయంపైన సమాలోచనలు చేయడానికి చంద్రబాబు సీనియర్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రత్యర్థి కోటలో ఉన్న నాయకులకు హై బిపి తెప్పించే స్థాయి నిర్ణయాన్ని సంధించిన జగన్ నాయకత్వ ప్రతిభపై మాత్రం తెలుగు ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ స్థాయిలో జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -