Monday, April 29, 2024
- Advertisement -

ఎన్నికల సవాల్….. బాబును అడ్డంగా బుక్ చేసిన జగన్

- Advertisement -

వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసిన స్థానాలకు ఉపఎన్నికలు వస్తే మొత్తం ఐదు సీట్లను ఏకపక్షంగా గెల్చుకుంటామని, ఆ తర్వాత ఇక 2019 ఎన్నికల్లో గెలుపు లాంఛనమే అవుతుందని తాజాగా భారీ డైలాగ్ పేల్చాడు బాబు. అయితే ఇదే డైలాగ్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు జగన్. వైకాపా ఎంపి స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే గెలుపోటములు ఎలా ఉంటాయని చెప్పి జగన్ దగ్గర ప్రస్తావించిన ఓ జర్నలిస్ట్‌తో తన అభిప్రాయం పంచుకున్నాడు జగన్. ఆ సందర్భంలోనే వైకాపా రాజీనామా చేసిన ఐదు ఎంపి సీట్లనూ ఏకపక్షంగా గెల్చుకుని 2019 ఎన్నికల్లో గెలుపును లాంఛనం చేసుకుంటామన్న చంద్రబాబు మాటల ప్రస్తావన కూడా వచ్చింది. చంద్రబాబు మాటలపై జగన్ స్పందించిన విధానం ఆ జర్నలిస్ట్‌ని కూడా షాక్‌కి గురిచేసింది.

ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తే …….. ఆ రాజీనామాలు చూపించి అయినా కేంద్రంపై ఒత్తిడితెద్దామన్న ఆలోచన అయినా చంద్రబాబుకు రాదు…….. కానీ ఆ ఐదు ఎంపి సీట్లను గెల్చుకుందామన్న కుతంత్రాలు మాత్రం చేస్తాడు. తెలంగాణా కోసం రాజీనామా చేసిన సందర్భంలో మొత్తం తెలంగాణా సమాజం రాజీనామా చేసిన నేతలకు అండగా నిలబడింది. చంద్రబాబుకు ఆ పాటి చిత్తశుద్ధి కూడా లేదు. అయినా ఆ ఐదు సీట్లూ గెల్చుకుని మాత్రం చంద్రబాబు ఏం చేస్తాడు? ఏం సాధిస్తాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న 25 మంది ఎంపిలలో ఇప్పుడు 20 మంది చంద్రబాబు పక్షానే ఉన్నారు. ఆ ఇరవైమందితో ఏమీ చేయలేని వాడు ఇంకో 5 మంది పెరిగితే మాత్రం ఏం చేయగలడు?

ఇక ఉప ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తానన్న చంద్రబాబు మాటలకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు జగన్. ‘చంద్రబాబుకు అంత దమ్మే కనుక ఉంటే వైకాపా నుంచి టిడిపిలో చేర్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందేలా చెయ్యొచ్చుగా…….అసెంబ్లీ స్పీకర్ ఆయన పార్టీ మనిషిలాగే వ్యవహరిస్తున్నాడుగా……..ఉత్త గాలి మాటలు మాట్లాడాలంటే చంద్రబాబు తర్వాతే ఎవరైనా…….నిజంగా 5 ఎంపి సీట్లకు ఉప ఎన్నికలు వస్తే టిడిపి గెలుస్తుందన్న నమ్మకం చంద్రబాబుకు ఉండి ఉంటే ఈ పాటికి ఎఫ్పుడో ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉండేవాడు………కాదంటారా?’ అని జగన్ స్పందించడంతో ఆ జర్నలిస్ట్‌కి ఏం రెస్పాన్స్ ఇవ్వాలో కూడా తెలియలేదు. జగన్ ఆలోచనా పరిధి, పరిణతి ఉన్నత స్థాయిలో ఉందని ఆ తర్వాత ఆ జర్నలిస్ట్ ఇతర జర్నలిస్ట్‌లతో కామెంట్ చేయడం వినిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -