Thursday, May 2, 2024
- Advertisement -

ఓట‌ర్ల తొల‌గింపుపై సీఈసీని క‌లిసిన జ‌గ‌న్‌…ఆ ముగ్గురు అధికారుల‌ను తొల‌గించండి

- Advertisement -

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీవెళ్లి సీఈసీని క‌లిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాగాన్ని, పోలీసు వ్యవస్థలను టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని తెలిపారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు అందజేశారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ 4ల‌క్ష‌ల వైసీపీ సానుభూతి ప‌రుల ఓట‌ర్ల‌ను తొల‌గించార‌ని వెల్ల‌డించారు. ఏపీలో బాబుకు అనుకూలంగా ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగించకూడదని కోరామన్నారు. రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 3 కోట్ల 69 లక్షల ఓట్లు ఉంటే అందులో సుమారు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన 35 మందిచి సీఐల నుండి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని జగన్ ఆరోపించారు. ఈ ప్రమోషన్ల జాబితాను కూడ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఇచ్చామని చెప్పారు.

లా అండ్ ఆర్డర్‌లో కోఆర్డినేషన్ పోస్ట్‌ను క్రియేట్ చేశారని జగన్ తెలిపారు. ఈ పోస్ట్‌లో కూడ తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌కు పోస్ట్ ఇచ్చారని జగన్ విమర్శించారు. ఏపీ డీజీపీ, ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీపీ, లా అండ్ అర్డర్ కో ఆర్డినేషన్ పోస్టు నుండి ఎన్నికల విధుల నుండి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టుగా జగన్ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -