Thursday, May 2, 2024
- Advertisement -

జ‌గ‌న్‌తోపాటు 9 మంది మంత్రుల ప్ర‌మాణ స్వీకారం

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త శ‌కానికి జ‌గ‌న్ నాంది ప‌ల‌క‌బోతున్నారు. దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా అలుపెర‌గ‌ని పోరాటం చేసిన జ‌గ‌న్ ఆశయం సాకారం కాబోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ 151 సీట్లు గెలిచి చ‌రిత్ర సృష్టించింది.

అయితే ఇప్పుడు జ‌గ‌న్‌తో పాటు మంత్రులుగా ఎవ‌రు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జ‌గ‌న్ ఒక్క‌రే ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌నె వార్త‌లు వ‌స్తున్నా ఆయ‌న‌తో పాటు 9మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.ఈనెల 30న ఏపీ సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్నారు.

అయితే తాజాగా తనతో పాటు మరో 9 మందికి మంత్రులుగా అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ తొమ్మది మందిలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆదిమూల‌పు సురేష్‌, కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్రసాదరావు, గ్రంధి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్, అవంతి శ్రీనివాస్, పేర్లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌తో స‌మానంగా 9 మంది మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

ఇదే ఊపులో లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. ఆ ఎన్నికల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వారిని ఎంపిక చేసి కేబినెట్‌లో చోటు కల్పించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -