Sunday, April 28, 2024
- Advertisement -

కేంద్ర క్యాబినేట్ లోకి వైసీపీ..?

- Advertisement -

కేంద్రంలో..రాష్ట్రంలో.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి మిత్రులు దూరం అయిపోతున్నారు. అదే సమయంలో వైసీపీకి బీజేపీ దగ్గరవుతోంది. ఇటీవల కాలంలో కేంద్రంలో నెంబర్ 1, 2 గా ఉన్న ప్రధాని మోడీ, అమిత్ షా వరుసగా ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేతలతో వైఎస్ జగన్ మధ్య బంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయా.. అంటే అవుననే అంటున్నాయి వర్గాలు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఎలాగైనా తన కూటమిలో చేర్చుకోవాలని కమలదళం చూస్తోందట. ఒకవైపు జాతీయస్థాయిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బలం తగ్గుతుండటం ఇంకోవైపు సుదీర్ఘకాలం మిత్రుడుగా ఉన్న పార్టీలు ఏన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయిన తరుణంలో.. సౌత్ ఇండియా నుండి స్ట్రాంగ్ ఫ్రెండ్ పార్టీ కావాలని ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలు భావిస్తున్నారట. భవిష్యత్తు తరాల రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలు ఫ్రెండ్లీ పార్టీగా జగనే కావాలని కోరుకుంటున్నారట.

ఈ మధ్య ఢిల్లీలో జరిగిన వైయస్ జగన్మోహన్ ప్రధాని మోడీ అమిత్షాల మీటింగ్ లోని ఈ ఫ్రెండ్షిప్ కు అంకురాపన జరిగింది. వాస్తవానికి 2019 సంవత్సరంలో అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో గెలుపొందాయి. ఆ సమయంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ ప్రభుత్వంలో చేరమని బీజేపీ కోరింది. అయితే జగన్ మాత్రం తాము బీజేపీ ప్రభుత్వంలో చేరమని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ మద్దతు ఇస్తామని తెలిపింది. మళ్ళీ 15 నెలల తర్వాత అదే బీజేపీ ప్రభుత్వం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒత్తిడి మొదలైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి లోక్సభ రాజ్యసభలో 28 మంది ఎంపీలు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద నాలుగోవ పార్టీగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఆవిర్భవించింది.

దీంతో ఇలాంటి పార్టీని తమ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అందుకే కేంద్ర మంత్రి అమిత్ షా కు ఆ బాధ్యతలు అప్పగిచారట. వైయస్ జగన్ మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు ముందురోజు సాయంత్రం భేటీ కావడమే కాకుండా మళ్లీ మరుసటి రోజు ఉదయమే అమిత్ షా భేటీ అయ్యారు సుమారు రెండు గంటలపాటు చర్చలో పాల్గొన్నారు. అయితే సోషల్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు మోడీతో జగన్ భేటీలో కొన్ని కీలక చర్చలు జరిగాయట. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాము బీజేపీలో చేరుతామని జగన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఏది ఏమైన జగన్ మాత్రం ఏపీ బాగు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అర్దం అవుతోంది.

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

ఎవరు మౌనంగా ఉన్నా ఈ టీడీపీ లీడర్లు మౌనంగా ఉండడం ఏంటి..?

అయ్యో మంత్రి గారు ఏంటి ఈ వరుస ఆరోపణలు.. నిజమేనా..?

దుబ్బాక లో కాంగ్రెస్ కు విమర్శనాస్త్రం దొరికినట్లేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -