Friday, May 3, 2024
- Advertisement -

భార‌తిపై వ‌చ్చిన త‌ప్పుడు క‌థ‌నాల‌పై స్పందించిన జ‌గ‌న్‌..

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో తొలిసారి ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసినట్లు ప‌చ్చ‌మీడియాలో మీడియాలో వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే.

అస‌లు విష‌యానికి క‌వ‌స్తే జగన్ భార్య భారతి పేరును చార్జిషీట్లో చేర్చడానికి ఈడీ కోర్టు అనుమతిని అడిగింది. అందుకు అనుమతి లభిస్తుందో లేదో తెలియదు కానీ.. జగన్ సతీ సమేతంగా కోర్టుకు హాజరు కావాలని పచ్చపైత్యాన్ని చాటుకున్నారు.వైఎస్ భారతి పేరును సీబీఐ అయితే వదిలింది కానీ, ఈడీ మాత్రం వదల్లేదని, రేపటి నుంచి జగన్ సతీసమేతంగా కోర్టుకు హాజరు కావాలని ప‌చ్చ‌ప‌త్రిక‌లో వార్త‌ను ప్ర‌చురించింది. ఈ ప్పుడు వార్త‌ల‌పై జ‌గ‌న్ తీవ్రంగా స్పందించారు.

తన ఆస్తుల కేసులో తన సతీమణి వైఎస్ భారతిని ముద్దాయిగా చేర్చారంటూ వచ్చిన వార్తలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ తన భార్యను ముద్దాయిగా చేర్చిందంటూ ఒక వర్గం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి, అది చూసి తాను షాక్ కు గురయ్యానని ఆయన అన్నారు.తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టడం లేదని, రాజకీయాలు అంతగా దిగజారడం చూసి విచారం వేసిందని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -