Monday, April 29, 2024
- Advertisement -

రోజా కి మళ్ళీ షాక్ ఇచ్చిన జగన్..?

- Advertisement -

సినిమాల్లోనుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయవంతం అయినా మహిళా నేతల్లో ఒకరు రోజా..ప్రజల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుని వైసీపీ పార్టీ లో యున్న మహిళా నేతల్లో బలమైన లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు రోజా.. తన విమర్శలతో సీఎం గా ఉన్న చంద్రబాబు నే అప్పట్లో గడగడలాడించింది. చంద్రబాబు ను ఎవరైనా గట్టిగా విమర్శించారంటే అది రోజా ఒక్కరే అని చెప్పాలి.. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు వెలిచారు.. 2014 లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన రోజా 2019 అయన వారసుడు గాలి భాను ప్రకాష్ మీద భారీ మెజారిటీ తో గెలిచారు.. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం తో టీడీపీ ఆ టికెట్ ను అయన వారసుడికి ఇచ్చారు..

ఇక మొదటినుంచి పార్టీ లో కీలక పాత్ర పోషించిన రోజా కి ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.. ప్రస్తుతం ఆమె నగరి ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఏ లోటు రానివ్వట్లేదు.. దాంతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పలుకుతున్నారు.. దీంతో అక్కడ టీడీపీ నాయకులూ సైతం రోజా పనితనానికి ముగ్దులవుతున్నారట.. టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి వారసుడు కూడా నగరి లో ఎక్కువ గా కనిపించకపోవడం రోజా కు కలిసొచ్చే అంశం.. ఇక ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు.

ఇన్ని చేస్తున్న ఆమెకు రెండు మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి రావడం ఖాయం అంటున్నారు.. అయితే తాజాగా ఆమెకు ఓ భారీ షాక్ జగన్ ఇచ్చారని తెలుష్ఠుడి. తాజాగా బీసీ కార్పొరేషన్ల నియామకం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్కే రోజా మరోసారి అసంతృప్తికి లోనయినట్లు తెలుస్తోంది. ఆర్కే రోజాకు స్థానిక వైసీపీ నేత కేజే కుమార్ కు మధ్య పొసగడం లేదు. సోషల్ మీడియా ద్వారా ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో కేజే కుమార్ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఎవరూ హాజరుకావద్దని ఆర్కే రోజా ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు.తాజాగా కేజే కుమార్ భార్య కేజే శాంతికి బీసీ కార్పొరేషన్లలో ఛైర్మన్ పదవి దక్కిందని ప్రచారం జరుగుతుంది. కేజే శాంతికి ఈడిగ కొర్పొరేషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించినట్లు ఆమెకు సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో రోజా ప్రత్యర్థి వర్గానికి పదవి దక్కడంతో ఆమె అనుచరుల్లోనూ అసహనం వ్యక్తమవుతుంది. నిజానికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -