Sunday, April 28, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఆఫ‌ర్‌కు ప్ర‌శాంత్ కిషోర్ ఒప్పుకుంటారా….?

- Advertisement -

ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ త‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు. 2014లో త‌క్కు శాతం ఓట్ల‌తో ఓట‌మిని చ‌వి చూసిన జ‌గ‌న్ ఈసారి అలాంటి అవకాశం ఇవ్వ‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చార వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియమించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ గెలుపుకోసం గత మూడేళ్లుగా పీకే నేతృత్వంలోని ఐప్యాక్ బృందం వైసీపీ కోసం తీవ్రంగా శ్ర‌మించింది.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌నుంచి అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌చారకార్య‌క్ర‌మాలు అన్నిట్లో పీకేటీం ప్ర‌ముఖ‌పాత్ర పోషించింది.గతనెల 11న జరిపి ఎన్నికల్లో వైసీపీ వ్యూహం బాగా వర్కవుట్ అయినట్టు అంతా భావిస్తున్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని అంతా ధీమాగా ఉన్నారు.

త‌న కోసం ప‌నిచేసిన పీకేకు జ‌గ‌న్ కూడా ఓఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తమ బంధం ఎన్నికల వరకే కాకుండా, ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షించినట్టు సమాచారం.తరఫున ఎప్పటికప్పుడు సర్వేలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది? ఏయే నేతల్లో ప్రజలపై సదభిప్రాయం ఉంది? వంటి అంశాలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా జగన్ మోహన్ రెడ్డికి అందించింది పీకే టీమ్. పార్టీ తరఫున సర్వేలు, పీకే టీమ్ సర్వేలను బేరీజు వేసుకుంటూ వైఎస్ జగన్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వైసీపీ ప్రభుత్వం పనితీరును ఎప్పటికప్పుడు తమకు తెలియజేసేలా పీకే టీమ్ ఉంటే బావుంటుందని జగన్ అభిప్రాయపడినట్టు తెలిసింది.ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ప్రశాంత్ కిశోర్, ఆయన బృందానికి థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్.మరి జగన్ ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ ఓకే అంటారా? లేకపోతే నో అంటారా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -