Thursday, May 2, 2024
- Advertisement -

మంగళగిరిలో చేనేతలకు కీలక హామీలు ఇచ్చిన జగన్… ఆళ్ల గెలుపు లాంఛనమే

- Advertisement -

ఎన్నికల ప్రచారం చివరిరోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడనుంచి టీడీపీ తరుపున బాబు పుత్రరత్నం లోకేష్ , వైసీపీ నుంచి ఆళ్ల పోటీ చేస్తుండంటే గెలుపును ప్రతీ ష్టాత్మకంగా తీసుకున్నారు. లోకేష్ ను ఓడించేందుకు జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు.

లోటస్‌పాండ్‌లో ఉంటూ జగన్ కుట్రలు పన్నుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన ఆయన… జగన్ ఇల్లు ఉన్నది తాడేపల్లిలో, చంద్రబాబు ఇల్లు ఉన్నది హైదరాబాద్‌లో అంటూ సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబుకు అమ్ముడుపోని వ్యక్తి ఎమ్మెల్యే ఆర్కే అంటూ ప్రశంసించారు. నా సోదరుడు ఆర్కే.. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి… కానీ, టీడీపీ అభ్యర్థి ఇప్పటి వరకు కాలు కూడా పెట్టలేదని.. మంగళగిరి నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు.

జగన్ రోడ్డుషోకు జనాలు పోటెత్తారనే చెప్పాలి. నిజానికి ఈ నియోజకవర్గంలో ఆళ్ళను ఎదుర్కొనే సత్తా లోకేష్ కు లేదనే చెప్పాలి. కాకపోతె లోకేష్ సీఎం కొడుకు కావడంతో డబ్బు, అధికార బలంతో గెలవాలని చూస్తున్న టీడీపీకీ జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీ గెలపు ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. అదే సమయంలో ఆళ్ళ గెలిస్తే మంత్రిపదవి ఖాయమని జగన్ చేసిన హామీ కూడా ప్రజలపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా వైసిపి అధికారంలోకి రాగానే ఇచ్చే ఎంఎల్సీ పదవుల్లో మొదటిది మంగళగిరిలోని చేనేతలకే ఇస్తాననే కీలకమైన హామీని కూడా ఇచ్చారు.

నియోజకవర్గంలో చేనేతల ఓట్లు సుమారు 50 వేల దాకా ఉన్నాయి. వాళ్ళంతా వైసిపికే ఓట్లేస్తే ఆళ్ళ గెలుపు ఖాయమే. అందకే జగన్ వ్యూహాత్మకంగా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో జగన్ వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలకు అధికార టీడీపీ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. మరి ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -