Saturday, April 27, 2024
- Advertisement -

ఏలూరు బ‌హిరంగ‌స‌భ‌లో బాబు దుమ్ముదులిపిన జ‌గ‌న్..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర మ‌రో చ‌రిత్రాత్మ‌క మైలురాయిని దాటింది. దాటింది.ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించిన పాద‌యాత్ర 2000 కి.మీ పూర్తి చేస‌కుంది. ఈ సంద‌ర్భంగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభ ఏర్పాటు చేసింది వైసీపీ. ఈ స‌భ‌లో చంద్ర‌బాబుపై ధ్మ‌జ‌మెత్తారు జ‌గ‌న్‌.

రాష్ట్రంలో ప‌రిపాల‌న యథా చంద్రబాబు.. తథా టీడీపీ ఎమ్మెల్యేలు అన్నట్లు సాగుతోంద‌న్నారు జ‌గ‌న్. చింతమనేనితోపాటు మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి గుండెల్ని పిండుతూ ఇసుక దండుకుంటున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి.. భూములను బజ్జీల మాదిరి తింటున్నాడు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహశీల్దార్‌ వనజాక్షిని ఎమ్మెల్యే చితమనేని జుట్టుపట్టుకుని లాక్కెళ్లాడు. అలాంటివాడిని పోలీస్‌ స్టేషన్‌లో పెట్టాల్సిందిపోయి, ముఖ్యమంత్రే పంచాయితీ చేశాడ‌ని బాబుపై దుమ్మెత్తి పోశారు.

దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో ఏలూరులో 12 వేల మందికి భూములు పంచ‌డంతోపాటు 5వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చార‌న్నారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కటంటే ఇక్క ఇల్లూ ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వైఎస్సార్‌ ట్యాంకులు కట్టించారు. ఇవాళేమో నీళ్లులేని గ్రామాలను పట్టించుకున్న పాపానపోలేద‌న్నారు

బాబు పాల‌న‌లో మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నార‌ని ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు జ‌గ‌న్‌. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేసేవాళ్లు నాయకులు కావాలా అని అడుగుతున్నా. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబు ఇచ్చిన హామీల‌ల్లో ఏదాన్ని పూర్తిగా నెర‌వేర్చ‌లేద‌న్నారు. ఒకప్పుడు రేషన్‌ షాపులో 185 రూపాయలకే అన్ని నిత్యావసరాలు వచ్చేవి. ఇవాళ రేషన్‌ కార్డులనే ఎత్తేసే పరిస్థితి దారునంగా ఉంద‌న్నారు.

రాజ్యాంగానికి తూట్లుపొడుస్తూ మీడియాను మేనేజ్‌ చేస్తూ నాలుగేళ్లుగా పాలనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలోనైతే ప్రజల్ని దారుణంగా మోసం చేశాడు. ఎన్నికలకు ముందు హోదా 10 ఏళ్లు కాదు, 15 ఏళ్లు కావాలని అడిగిన బాబు నాలుగు సంవ‌త్సారాలు భాజాపాతో కాపురం చేసిశార‌న్నారు. అప్పుడు గుర్తుకు రాని ప్ర‌త్యేక‌హోదా …వైసీపీ వాళ్లు హోదాకోసం పోరాటం చేస్తుంటే బాబే అడ్డుకున్నార‌న్నారు. ఇప్పుడేమో ప్ర‌త్యేక‌హోదా కాలంటారంటూ ఎద్దేవ చేశారు.

హోదా విషయంలో చంద్రబాబు అబద్ధాలు క్లైమాక్స్‌కు చేరాయ‌న్నారు. ఆయ‌న బాబాలాగా దీక్ష‌చేస్తుంటే అందరూ వెళ్లి కాళ్లు మొక్కాలట. విశాఖలో సదస్సులు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెబుతా ప్ర‌జ‌ల‌ను దారునంగా మోసం చేశార‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -