Wednesday, April 24, 2024
- Advertisement -

ప్ర‌భుత్వం.. మొద్దునిద్ర‌పోతుంది: వైయస్ షర్మిల

- Advertisement -

ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో భాగంగా 18వ రోజు మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామంలోని మండల్ పరిషత్ స్కూల్ ను వైయస్ షర్మిల సందర్శించారు. అన్ని గ్రామాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా సిబ్బంది కొరత ఉంద‌ని స్థానికులు తెలిపారు.

మధ్యాహ్న భోజన బిల్లులు మంజూరుకావడం లేద‌ని నిర్వాహ‌కులు వాపోయారు. టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయ‌ని స్టూడెంట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ ష‌ర్మిల మాట్లాడుతూ.. పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌నందించాల్సింది పోయి రాష్ట్ర ప్ర‌భుత్వం.. మొద్దునిద్ర‌పోతోంద‌న్నారు.

మ‌ద్యానికి ఇచ్చిన విలువ చ‌దువుకు ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు, పిల్ల‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యావ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్దుతాని వైయ‌స్ ష‌ర్మిల మాటిచ్చారు.

తెలంగాణలో రాజకీయం ఇక రసవత్తరం..‌

ఆ ఇద్దరు మినిష్టర్ లపై ట్రోలింగ్..

టిఎస్ లో బేష్ .. ఎపి లో తుస్ ..

టిఆర్ఎస్ కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుందా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -