Wednesday, May 8, 2024
- Advertisement -

షర్మిల అందుకే దుకాణం బంద్‌ చేసిందా?

- Advertisement -

తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ ఖేల్ ఖతమైంది. రాజన్న రాజ్యం తెస్తానంటూ వచ్చిన జగనన్న బాణం షర్మిల చాపచుట్టేసింది. 3వేల కిలోమీటర్లు, ప్రతీ మంగళవారం నిరుద్యోగ దిక్ష ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు షర్మిలను నమ్మలేదు. దీంతో కొంతకాలంగా సైలెంట్‌ అయి తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైంది.

అయితే వాస్తవానికి తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ స్ధాపించినప్పుడే ఇది ఎంతకాలం ఉంటుందో అని అంతా అంచనా వేశారు. వారి అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా కొద్దిరోజుల్లోనే చాపచుట్టేసింది. అయితే ప్రజలకు త్వరగా అర్ధమైనా షర్మిలకు మాత్రం తాను ఎంచుకున్నది తప్పని తెలియడానికి కొంతకాలం పట్టింది.

వాస్తవానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడమే ఆమె చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే స్వరాష్ట్రం నినాదం నుండి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మగౌరవం పేరుతో వచ్చిన టీడీపీని ప్రజలు ఆదరించారు. తెలంగాణలో సైతం గ్రామగ్రామాన టీడీపీ అభిమానులు ఇప్పటికి ఉన్నారు. అయితే తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయింది. టీడీపీని ఆంధ్రాపార్టీగా విశ్వసించడంతో క్రమక్రమంగా ఆ పార్టీ మూతపడిపోయింది. టీడీపీకి తెలంగాణ కమిటీ ఉన్న అది పేరుకే పరిమితం అయింది.

ఇది జరిగిన కొద్దిరోజులకే నేనున్నా అంటూ బయలు దేరిన షర్మిలకు భంగపాటు తప్పలేదు. 3 వేల కిలోమీటర్లు నడిచి, వందల కోట్లు వృధా చేసుకున్నాక తెలంగాణ ప్రజల నాడీ అర్ధమైంది. ఒక్కరంటే ఒక్కరు పేరున్న నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోలేకపోగా జనం నుండి కూడా అంతగా స్పందనలేదు. ఇంకా పార్టీని నడిపి ప్రయోజనం లేదని తెలుసుకున్నాక కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. అయితే కాంగ్రెస్‌లో షర్మిలకు ఏ మేరకు ప్రాధాన్యం ఉంటుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -