Saturday, April 27, 2024
- Advertisement -

నేడు వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ ఆవిర్భావం

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లోకి మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు తన పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు.

జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్‌ అభిమానుల సమక్షంలో వైఎస్‌ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను ఆవిష్కరించి తెలంగాణాలో తాను పార్టీ ఎందుకు పెట్టబోతున్నారో తెలపబోతున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా లింక్‌ను పార్టీ యంత్రాంగం ఇప్పటికే దాదాపు పదివేల మంది వరకు షేర్‌ చేసినట్లు వెల్లడించింది.

పార్టీకి సంబంధించి పాలపిట్ట, నీలం రంగుతో కూడిన జెండాను రూపొందించారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా డిజైన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్‌ షర్మిల రోడ్‌మ్యాప్‌ ఖరారైంది.

ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితోపాటు కోర్ టీం సభ్యులైన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు సభావేదికపై జెండా ఆవిష్కరణలో పాల్గొంటారు.

పవర్​స్టార్​ ​​- హరీశ్​శంకర్​​ మూవీ సబ్జెక్ట్​ ఇదే?

ఏపీలో బడులు స్టార్ట్ .. ఎప్పటినుంచంటే?

‘పుష్ప’ ఆఖరి షెడ్యూల్​ ప్రారంభం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -