Thursday, May 9, 2024
- Advertisement -

విజయసాయి అక్కడ సక్సెస్ అయితే 2019లో జగనే సిఎం

- Advertisement -

నాలుగేళ్ళుగా ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పోరాటం……. ఇంకా చెప్పాలంటే పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ జగన్ పడుతున్న కష్టం…. ప్రజాసంకల్పయాత్ర కష్టం మొత్తం ఫలితం ఇప్పుడు విజయసాయి చేతుల్లో ఉంది. 2019లో వైకాపా అధికారంలోకి వస్తుందా? జగన్‌కి సిఎం అయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు విజయసాయి చేతల్లోనే ఇప్పుడు సమాధానం ఉంది. ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసినప్పటికీ చంద్రబాబుతో సహా పచ్చ మీడియా మొత్తం వ్యతిరేక ప్రచారం పుణ్యమాని పార్టీకి ఎంతలాభించింది అంటే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి పార్లమెంట్ సమావేశాలు ముందుకు వస్తున్నాయి.

లోక్ సభలో వైకాపా ఎంపిలు లేని నేపథ్యంలో ఈ సమావేశాలను వైకాపాను కార్నర్ చేయడానికి టిడిపి సమర్థంగా ఉపయోగించుకుంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే వైకాపాకు బిజెపికి సంబంధాలు అంటూ పచ్చ బ్యాచ్ మొత్తం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విజయసాయిరెడ్డి ఒక్కడే మొత్తం టిడిపి ఎంపిలు అందరినీ ఎదుర్కుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న టిడిపికంటే వైకాపానే ఎక్కువగా పోరాటం చేస్తోందని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు విజయసాయి భుజస్కందాలపైనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా కూడా ఎపి నాయకులందరూ ఫైట్ చేయాల్సిందే. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ ఫణంగా పెట్టి మరీ నాలుగేళ్ళుగా…….ఇంకా చెప్పాలంటే రాష్ట్ర విభజన సమయం నుంచీ కూడా సీమాంధ్రులకు చంద్రబాబు తీరని ద్రోహం చేశాడనడంలో సందేహం లేదు. అందుకే ప్రజలు చంద్రబాబు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే అదే టైంలో చంద్రబాబుకు సరైన ప్రత్యర్థిని అని చెప్పుకుంటున్న జగన్ కూడా బాబు లాగే వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టను అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఎందాక అయినా పోరాటం చేస్తానని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. సోనియాను ఎదిరించినందుకే జగన్‌కి ప్రజల్లో హీరోయిక్ ఇమేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు మరోసారి అదే స్థాయి హీరోయిజాన్ని సీమాంధ్రులతో పాటు జగన్ అభిమానులు కూడా ఆశిస్తున్నారు. చంద్రబాబుపై పోరాటం చేయడంతో పాటు మోడీకి వ్యతిరేకంగా కూడా వైకాపా వాయిస్ బలంగా వినపడాలని వారు కోరుకుంటున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రజలు ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు వైకాపా తరపున అన్నీ మేనేజ్ చేస్తున్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏ మేరకు సీమాంధ్రుల వాయిస్ వినిపిస్తాడు? చంద్రబాబు తప్పులను ఎత్తి చూపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి చేస్తున్న అన్యాయాన్ని ఏ మేరకు ప్రశ్నిస్తాడు అన్న విషయాలపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో చేసిన పోరాటాలను ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే సిఎం రమేష్ నిరాహారదీక్ష అట్టర్ ఫ్లాప్ అయింది. అలాంటి నేపథ్యంలో ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వ తప్పులు, బాబు చేతకానితనాన్ని ఎండగడుతూనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై విజయసాయి నిర్మాణాత్మక పోరాటం చేయడంలో విజయసాయి సక్సెస్ అయ్యాడంటే మాత్రం 2019 ఎన్నికల్లో వైకాపాకు తిరుగే ఉండదు అనడంలో సందేహం లేదు అని విశ్లేషకులు కూడా ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారు. మరి విజయసాయి ఈ పరీక్షలో పాసవుతాడా? ఆంద్రప్రదేశ్ ప్రజల మెప్పు పొందుతాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -