Monday, April 29, 2024
- Advertisement -

విజయసాయి చెప్పిందేంటి? పచ్చ బ్యాచ్ వక్రీకరణలు ఏంటి?

- Advertisement -

తనను మించిన నాయకుడు దేశంలోనే లేడు అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటాడు కానీ చేతల్లో మాత్రం పూర్తి రివర్స్ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని, నిర్ణయాలను ఎంతలా విమర్శిస్తే….. జగన్ వ్యక్తిత్వాన్ని హరించేలా అబద్ధాపు ప్రచారాలు చేయిస్తే…… జగన్ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బకొడితే తప్ప తాను కనీసం నిలబడలేను అన్నంత…. అత్యంత బలహీనుడు చంద్రబాబు. అందుకే జగన్ ఏం చేసినా అడ్డగోలు విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇక బాబు భజన బృందం, పచ్చ మీడియా అంతా కూడా అనుక్షణం అదే ప్రయత్నంలో ఉంటారు. దమ్ముంటే మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టు జగన్ అని పవన్ ఛాలెంజ్ చేస్తే పచ్చ బ్యాచ్ అంతా కూడా జగన్ ఇరుక్కున్నాడు అనే స్థాయిలో ప్రచారం చేసింది. జగన్‌కి అవిశ్వాసం పెట్టే దమ్ముందా అని ఎద్దేవా చేసింది. కట్ చేస్తే ఆ వెంటనే అవిశ్వాసానికి సై అన్నాడు జగన్. అది కూడా టిడిపి పెట్టినా మద్దతిస్తాం….. మేం తీర్మానం పెడితే టిడిపి మద్దతిస్తుందా అని సూటిగా అడిగాడు. ఆ మరుక్షణం నుంచే అవిశ్వాసంతో ఒరిగేది ఏమీ లేదు అని చంద్రబాబు, భజనసేనుడు పవన్‌తో సహా అందరూ యూ టర్న్ తీసుకున్నారు. ఎందుకంటే అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతివ్వలేడు కాబట్టి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే చంద్రబాబు పచ్చ మీడియాకు ఇచ్చిన లీకుల్లో జగన్ పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదు అని ప్రశ్నించాడు. ఆ వెంటనే రాజీనామాలకు సై అన్నాడు జగన్. ‘అబ్బే రాజీనామాల వళ్ళ ఉపయోగం ఏమీ లేదు’ అని పచ్చ బ్యాచ్ అంతా కొత్త పాట అందుకుంది.

ఇప్పుడు తాజాగా విజయసాయి ఏదో వ్యాఖ్యలు చేశాడని రచ్చ రచ్చ చేస్తోంది పచ్చ బ్యాచ్. ‘ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో చేతులు కలపడానికి రెడీ’ అన్నది వైకాపా స్టాండ్. ఆ మాటకొస్తే ఏ పార్టీతోనైనా కలవడానికి రెడీ…….. కాకపోతే ప్రత్యేక హోదా ఇస్తేనే అన్నది జగన్ పెడుతున్న షరతు. ఇదే విషయంపై ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడాడు విజయసాయి. ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో కలుస్తారా అన్న ప్రశ్నకు కలుస్తాం అని చెప్పాడు. కాంగ్రెస్‌ పార్టీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. అయినా కాంగ్రెస్‌కి అంతచిత్తశుద్ధి ఉంటే విభజన సమయంలోనే ఇచ్చి ఉండేదని అన్నాడు. ఆ తర్వాత రాజకీయ విషయాలను పక్కనపెడితే ప్రత్యేక హోదా ఇస్తామంటే మాత్రం కాంగ్రెస్, బిజెపి అని కాదు…….. ఏ పార్టీతో కలవడానికి అయినా సిద్ధంగా ఉన్నాం స్పష్టం చేశాడు విజయసాయి. ఈ మాటల్లో ఏమైనా తప్పుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ఇంకా మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతున్న చంద్రబాబు…… ఎన్డీఏ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు గురించి ఎవ్వరూ మాట్లాడరు. కానీ ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో సహా ఏ పార్టీకి అయినా మద్దతిస్తాం అని జగన్ అంటే మాత్రం అదో పెద్ద బూతం అన్నట్టుగా….. బిజెపిలో జగన్ కలిసిపోయాడు అన్నట్టుగా ప్రచారం చేస్తారు. అందుకే మరి……. రాజకీయ విశ్లేషకులు తరచుగా చెప్తూ ఉంటారు. చంద్రబాబుకు ఆయన భజన మీడియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అస్సలు అవసరం లేదు. జగన్‌పై విష ప్రచారం చేస్తూ ఉండాలి. చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఉండాలి. అధికారాన్ని అనుభవిస్తూ ఉండాలి అన్న ఒకే ఒక్క ఎజెండాతో పని చేస్తూ ఉంటారని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -