Monday, April 29, 2024
- Advertisement -

హోదా పోరాటం….. చంద్రబాబు, జగన్‌ల వ్యూహాలు, చిత్తశుద్ధి ఏంటంటే?

- Advertisement -

చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకుంటున్నారు. గతంలో ఇదే చంద్రబాబు హోదా వేస్ట్, ప్యాకేజ్ బెస్ట్, మోడీ ఇంకా బెస్ట్ అంటూ వేసిన వేషాల విషయం పక్కనపెడితే……ప్రస్తుతం చంద్రబాబు, జగన్‌ల పోరాటం ఉన్న వ్యత్యాసం ఏంటి? రాష్ట్రం కోసం పోరాడుతున్నాం అని ఇద్దరూ చెప్పుకుంటున్నారు. దాంతోపాటు చిత్తశుద్ధితో పోరాడుతుంది తామే అని కూడా ఇద్దరూ చెప్పుకుంటున్నారు. అవతలివాళ్ళకు చిత్తశుద్ధి లేదు అని కూడా ఇద్దరూ మాట్లాడుతున్నారు. మరి అసలు నిజాలు ఏంటి? అది కూడా పచ్చ మీడియా రాతల్లో కనిపించేలాంటి ఊహాజనిత, కల్పిత నిజాలు కాకుండా కంటికి కనిపిస్తున్న నిజాలు ఏంటి?

2014-15 సంవత్సరాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్ధేశ్యం లేదు అని తెలిసిన వెంటనే ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు….ఆంధ్రప్రదేశ్‌కి జీవనాధారం అని రంగంలోకి దిగిన నాయకుడు జగన్. ఆ మరుక్షణం నుంచే ఆందోళనలు, నిరాహారదీక్ష, ధర్నాలు ఇలా పోరాటం చేస్తూనే ఉన్న వైనం కంటికి కనిపిస్తూనే ఉంది. ఇక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వైఎస్ జగన్. అవిశ్వాసం వేస్ట్ అని జగన్‌ని ఎద్దేవా చేసిన చంద్రబాబు……ఆ వెంటనే మాట మార్చి టిడిపి కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది అన్నాడు. అలాగే ఆ తర్వాత కూడా ఎంపిల చేత రాజీనామా చేయిస్తాను అన్నాడు జగన్. చెప్పినట్టుగానే ఎంపిలు రాజీనామాలు చేశారు. ఆ వెంటనే నిరాహారదీక్షకు కూడా కూర్చున్నారు. ఇలా జగన్ పార్టీ చేస్తున్న పోరాటాలు అన్నీ కంటికి కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక చంద్రబాబు పార్టీ చేస్తున్న పోరాటాలను చూద్దాం. జగన్ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లోనూ, జాతీయ స్థాయిలో పార్టీల్లోనూ మంచి స్పందన కనిపించడంతో అవిశ్వాస తీర్మానం క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు చంద్రబాబు. టిడిపి పోరాటంలో ప్రత్యక్ష్యంగా కనిపించింది ఇదొక్కటే. ఇక ఆ తర్వాత నుంచీ చంద్రబాబుకు మోడీ బెదిరిపోయాడు, పార్లమెంట్‌లో ఉన్న చంద్రబాబును చూసి మోడీ దొంగచాటుగా పారిపోయాడు లాంటి ఛీప్ డ్రామా వార్తలను తన భజన మీడియాలో రాయించుకోవడం, అలాగే విజయసాయిరెడ్డి మోడీ కాళ్ళు పట్టుకున్నాడని అబద్ధపు ప్రచారానికి తెరలేపడం…….అన్నింటికీ మించి ఢిల్లీ వెళ్ళి కనిపించిన ప్రతివాళ్ళతో ఫొటోలు దిగి హంగామా చేయడం, చంద్రబాబు పార్లమెంట్‌కి మొక్కితే అదేదో అద్భుతం అన్నట్టుగా పచ్చ మీడియా మొత్తం పూనకాలు వచ్చినట్టుగా రాయడం……ఇలా సాగుతోంది చంద్రబాబు సారథ్యంలో టిడిపి పోరాట తీరు. అన్నీ అబద్ధపు ప్రచారాలే. అంతా డ్రామానే. ఇక ఎంపిల రాజీనామాలు వేస్ట్ అని చంద్రబాబు అనడం పలాయనవాదానికి పరాకాష్ట. నాలుగేళ్ళుగా ఇదే టిడిపి ఎంపిలు ఢిల్లీలో ఉండి ఏం చేశారట? ఇక ఉన్న ఏడాదిలో కూడా పదవులు పట్టుకుని వేలాడి వీళ్ళు చేసేది ఏంటి? కనీసం రాజీనామాలు అన్నా చేస్తే జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికలను ఎదుర్కుని గెలిస్తే ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎంత పట్టుదలగా ఉన్నారో దేశం మొత్తానికి అర్థమవుతుంది. తెలంగాణా విషయంలో కెసీఆర్ చేసింది ఇదికాదా?

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ప్రచార హోరుతో, అబద్ధాల డ్రామాలతో ప్రజలను మెప్పించాలన్న ప్రయత్నాలు తప్పితే నిజాయితీగా పోరాటం చేసిన చరిత్ర చంద్రబాబుకు ఎక్కడైనా ఉందా? అందుకే వైఎస్ జగన్ పోరాట పంథా, వైకాపా పోరాటం మొత్తం కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, ఇక యుధ్ధమే, తాడోపేడో తేల్చేయాల్సిందే, మోడీ బెదిరిపోతున్నాడు, పారిపోతున్నాడు, బాబు దెబ్బ–మోడీ అబ్బా……..అంటూ తన భజన మీడియాలో బాబు పోరాటం అంటూ రక్తికట్టించే ప్రచారంతోనే బాబు సంతృప్తి పడిపోతున్నాడు. విభజన నాడు కూడా చంద్రబాబుది ఇదే తీరు. 2014 ఎన్నికల తర్వాత నుంచీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అథోగతి దిశగా సాగుతూ ఉండడానికి కూడా చంద్రబాబు ఈ ప్రచార డ్రామాలే కారణం. అయినప్పటికీ చంద్రబాబులో మాత్రం ఎప్పటికీ మార్పు రాదు. ఎందుకంటే ఈ ప్రచార వ్యూహాలు, డ్రామాలు లేకుండా నాయకుడిగా చంద్రబాబు ఏంటి అంటే ……బాబు చేస్తున్న పోరాటం ఏంటో చెప్పమంటే చంద్రబాబు భజన బృందంలో ప్రథమ సభ్యుడు అయిన రాధాకృష్ణ కూడా ఏమీ చెప్పలేడేమో………తన వీకెండ్ కామెంట్‌లో ఒక్క అక్షరం కూడా రాయలేడేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -