Thursday, May 2, 2024
- Advertisement -

ఇంటర్ స్టూడెంట్ నెలకు 12 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా..?

- Advertisement -

ఛాలెంజ్ గా తీసుకునే ఏ కొన్ని పనులకు ఆయిన వయసు, చదువు, హోదాలతో పని అవసరం లేదని.. నిరూపించాడు ఓ స్టూడెంట్. కొందరు మనకెందుకు.. మన స్థాయి ఎంత అని పెద్ద టాస్క్ చేయడానికి ముందుకు రారు. కానీ ఈ కుర్రాడు అలా చేయలేదు. ముందు అడుగు వేసి.. వరల్డ్ వైడ్ గా ఫాపులర్ అయ్యాడు. ఇంటర్ కూడా కంప్లీట్ చేయకుండానే నెలకు 12 లక్షల వేతనంతో గూగుల్ లో ఉద్యోగం సంపాదించడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.

పూర్తి విషయంలోకి వెళ్తే.. చండీగఢ్ లోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో సీనియర్ సెకెండరీ స్కూల్ లో ఐటీ చదువుతున్న హర్షిత్‌ శర్మ కు గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం కల. పదేళ్ల వయసు నుండే బంధువు రోహిత్ శర్మ ప్రేరణతో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్న హర్షిత్ శర్మ డిజిటల్ ఇండియాలోభాగంగా పలు కార్యక్రమాలకు పోస్టర్లు డిజైన్ చేశాడు. పలు బాలీవుడ్ తారల పోస్టర్లు కూడా ఆకట్టుకునేలా రూపొందించేవాడు. అలా డిజైనింగ్ చేస్తూ ప్రతి నెలా 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించేశాడు. దీని స్పూర్తిగా గూగుల్ కు తను రూపొందించిన పలు పోస్టర్లు పంపాడు. వాటిని పరిశీలించిన గూగుల్ సంస్థ తమ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగానికి ఆహ్వానించింది.

ఏడాది శిక్షణ కోసం కాలిఫోర్నియా గూగుల్ కార్యాలయానికి రావాలని సూచించింది. శిక్షణ సమయంలో నెలకు 4 లక్షల రూపాయల వేతనం ఇస్తామని తెలిపింది. శిక్షణ ముగిసిన అనంతరం నెలకు 12,00,000 రూపాయల వేతనం ఇస్తామని పోస్టింగ్ ఆర్డర్ లో తెలిపింది. తను అనుకున్న సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం రావడంతో.. హర్షిత్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ నెలలోనే కాలిఫోర్నియా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=ZIU-EhAfq_Y

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -