Monday, April 29, 2024
- Advertisement -

నోరూరించే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో తెలుసా?

- Advertisement -

మన తెలుగు రాష్ట్రాలలోని వంటకాలలో చట్నీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇడ్లీ దోస పొంగల్ వంటి టిఫిన్స్ లోకి తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. అయితే చట్నీలను వివిధ రకాల పదార్థాలతో ఎంతో రుచిగా తయారు చేసుకుంటాము. మరి అన్నంలోకి కూడా ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి చెట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
పచ్చి కొబ్బెర 1 కప్పు, పచ్చిమిర్చి10, ఎండు మిర్చి 2, ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్, బాగా పండిన టమోటాలు 2, చింతపండు చిన్న నిమ్మ పండు సైజు. కరివేపాకు రెమ్మ, కొత్తిమీర కొద్దిగా, నీళ్లు తగినన్ని, నూనె తగినంత, ఉప్పు రుచికి సరిపడినంత.
తయారీ విధానం:
*ముందుగా పచ్చి కొబ్బెరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి దోరగా వేయించుకోవాలి.

*కొబ్బరిని ఒక ప్లేట్లో వేసి ఆ తర్వాత పచ్చిమిర్చిని పచ్చిమిర్చి వేగిన తరువాత వాటిని పక్కకు తీసి అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేయించాలి.

Also read:సొరకాయతో ఎంత అందమో.. ఎలా అంటే?

*టమోటో ముక్కలు మెత్తగా మారే సమయంలో అందులోకి చింతపండు వేయాలి. ఈ విధంగా వీటిని వేయించుకుని చల్లారనివ్వాలి.

*తరువాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో కి వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

*ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మ వేసి వేయించాలి.

Also read:పనస గింజలతో రోగనిరోధకశక్తి నిజంగా పెరుగుతుందా?

*ఆవాలు చిటపట అనగానే ఈ పోపును ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కొబ్బరి చట్నీలోకి వేసి కలుపుకుంటే ఎంతో నోరూరించే రుచికరమైన కొబ్బరి చెట్నీ తయారైనట్లే.

*ఈ కొబ్బరి చట్నీ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వర్ణించలేనిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -