Saturday, April 27, 2024
- Advertisement -

దర్శిలో గెలుపు గుర్రం ఎవ్వరు..?

- Advertisement -

రాష్ట్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ గెలుపు గుర్రాల‌ను వెతికి ప‌ట్టి మ‌రీ.. టిక్కెట్ల‌ను ఇస్తున్నాయి. తాజాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లాలో గెలుపు గుర్రాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది. ప్ర‌కాశం జిల్లాలోని దర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈసారి ప్ర‌ముఖ పారిశ్రామిక, విద్యావంతుడు, సామాజిక వేత్త మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీద‌కు తెచ్చింది. ఆయ‌న‌కు దర్శి టిక్కెట్‌ను ఇచ్చి బ‌రిలోనికి దింపింది. విద్య‌తోనే స‌మాజాభివృద్ధి సాధ్య‌మ‌ని బ‌లంగా న‌మ్మిన‌.. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌.. ఆ రంగంలోనే పేద విద్యార్థుల‌కు నిరంత‌ర సేవ‌లు అందిస్తూ వ‌చ్చారు. దీనికిగానూ అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటి ఆఫ్ సౌత్ అమెరికా నుంచి డాక్టరేట్ సైతం ఆయ‌న‌కు వ‌చ్చింది. దర్శి నియోజ‌క‌వ‌ర్గంలో వేణుగోపాల్‌కు టిక్కెట్‌ను కేటాయించ‌డంతోనే.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ ఖాతాలో ఓ టిక్కెట్‌ను వేసుకున్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా.. కేవ‌లం సేవే ప‌ర‌మావ‌ధిగా సాగుతున్న మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌కు దర్శి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థుల‌కు ఉచిత విద్య‌, భోజ‌న‌వ‌స‌తి క‌ల్పించ‌డంతో పాటూ క‌ళాశాల‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించి.. విద్య‌, ఉపాధి రంగాల్లో యువ‌త‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్న కుటుంబం.. వేణుగోపాల్‌ది.

తెలుగుదేశం పాల‌కుల నిర్ల‌క్ష్యంతో ద‌రిశి నియోజ‌క‌వ‌ర్గం గ‌త ఐదేళ్ల‌లో అనుకున్నంత‌గా అభివృద్ధిని సాధించ‌లేక‌పోయింది. దర్శిలోని దొన‌కొండ‌లో ఉన్న వేల ఎక‌రాల భూముల్లో పారిశ్రామిక కారిడార్‌, విమానాశ్రయం వంటివి ఏర్పాటు చేస్తామంటూ తెలుగుదేశం ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది.. కానీ ఒక్క ఇటుక‌ను కూడా ఇక్క‌డ క‌దిపింది లేదు. దీంతో ఐదేళ్ల కింద‌టి వ‌ర‌కూ జ‌రిగిన అభివృద్ధే త‌ప్ప‌.. కొత్త‌గా చేసింది ఏమీ లేదు. ఐదేళ్ల కింద‌ట బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ క‌నిపిస్తోంది. తాజాగా బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి స‌పోర్ట్‌తో వైఎస్ ఆర్ సీపీ త‌ర‌ఫున వేణుగోపాల్ ఈసారి బ‌రిలోనికి దిగుతున్నారు. పైగా తెలుగుదేశం ప్ర‌భుత్వం.. దర్శి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి.. మంత్రి కూడా అయిన శిద్దా రాఘ‌వ‌రావును ఇక్క‌డి నుంచి త‌ప్పించింది. ఒంగోలు ఎంపీగా ఈసారి శిద్దాను బ‌రిలోనికి దింపుతోంది. తెలుగుదేశం ప్ర‌భుత్వం, గ‌త ఎమ్మెల్యేపై దర్శిలో తీవ్ర వ్య‌తిరేఖ‌త ఉండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ గ‌మ‌నిస్తే.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ఇప్ప‌టికే ఖాయ‌మైపోయింద‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. దర్శిలో ఈసారి ఎలా చూసినా.. వేణుగోపాల్ విజ‌యం ఖాయ‌మైపోయింది.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోనికి కేవ‌లం సేవాభావంతో వ‌చ్చేవాళ్లు క‌రువైపోయారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ లాంటి విద్యావంతులు, సేవా భావం ఉన్న వాళ్ల‌ను వెతికి మ‌రీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి టిక్కెట్ల‌ను ఇచ్చి బ‌రిలోనికి దింపుతున్నారు. ఎలాంటి అధికారం లేకుండానే త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను నిరంత‌రంగా కొన‌సాగిస్తూ వ‌చ్చిన వేణుగోపాల్‌.. ఇది త‌న‌కు దొరికిన గొప్ప అవ‌కాశంగా భావించి.. ముందుకు వెళుతున్నారు. ఇప్ప‌టికే.. ద‌రిశి నియ‌జ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌ను సంపాదించిన వేణుగోపాల్‌.. వారికి మ‌రింత మెరుగైన సేవ‌లు అందించాల‌నే కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన త‌న‌కు సమాజం కోసం మంచి చెయ్యాలన్న తపనే రాజకీయాల వైపు తీసుకొచ్చింద‌ని వెల్ల‌డించారు. ఓ సామాన్యుడినైన త‌న‌కు ఈ స్థాయికి తీసుకొచ్చిన దర్శి ప్రజల రుణం తీర్చుకునేందుకు ఇదో మంచి అవ‌కాశంగా భావిస్తున్నాన‌న్నారు. జగనన్న నవరత్నాలు, ప్రజలకి మేలు చెయ్యాలి అన్న కసి త‌న‌ను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసింద‌న్నారు.

బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గారి పూర్తి స‌హ‌కారం,వారి అమూల్యమైన సలహాలతో దర్శి నియోజకవర్గ అభివృద్ధే ప్ర‌ధాన ధ్యేయంగా ముందుకెళుతున్నాన‌ని.. త‌న‌కు ప్ర‌జ‌ల స‌హ‌కారం కావాల‌ని మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ్ఞ‌ప్తి చేశారు. తాను గెలిచిన త‌ర్వాత‌.. అదిచేస్తా.. ఇది చేస్తా అని మాట‌లు చెప్పే వ్య‌క్తిని కాదని.. ఆ విష‌యం ఇప్ప‌టికే త‌న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా నిరూపించుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌ధానంగా పాల‌కులు నిర్ల‌క్ష్యం చేసిన దొన‌కొండ పారిశ్రామిక అభివృద్ధి, విమానాశ్ర‌యం వంటి వాటికి త‌న శ‌క్తివంచ‌న లేకుండా అధికారంలోనికి వ‌చ్చాక‌.. జ‌గ‌న‌న్న స‌హ‌కారంతో చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఉచిత విద్య అందిస్తూ, ఎన్నో దేవాలయాలు, స్కూళ్లకు దానధర్మాలు చేసి, ఆర్థికంగా వెనుకబడిన పార్టీ కార్యకర్తలకు సహాయం చేస్తూ వారి సమస్యలను ప‌రిష్క‌రించ‌డంలో వేణుగోపాల్ అన్ని వేళ‌లా ముందుంటున్నారు. తండ్రి మద్దిశెట్టి శ్రీనివాసరావు, త‌ల్లి కస్తూరమ్మ, న‌లుగురు అన్న‌ద‌మ్ముల స‌హ‌కారం, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతోనే ఇంత‌వ‌ర‌కూ రాగ‌లిగాన‌ని, ఇక‌ముందు.. మ‌రింత‌గా జ‌నంలో క‌లిసిపోయి.. వారి స‌మ‌స్య‌ల‌ను త‌న స‌మ‌స్య‌లుగా భావించి ప‌రిష్కారానికి కృషి చేస్తానంటూ వేణుగోపాల్ వెల్ల‌డించారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచిన జ‌గ‌న‌న్న ఆశ‌యాల సాధ‌నే త‌న ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మంటూ వెల్ల‌డించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -