Wednesday, April 24, 2024
- Advertisement -

మొబైల్ కు రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా.. జాగ్రత్త !

- Advertisement -

స్మార్ట్ ఫోన్ వాడకం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ మొబైల్ కు రాత్రంతా చార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం కరెక్టేనా లేదా తప్పా ? అని ఏవి ఆలోచించకుండా నైట్ అంత మొబైల్ కు చార్జింగ్ పెట్టి ఉదయం తీస్తుంటారు. మరి ఇలా చేయడం వల్ల జరిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదు. మరి అవేంటో ఒకసారి చూద్దాం !.

1.మొబైల్ కు రాత్రంతా చార్జింగ్ పెట్టడం వల్ల ముఖ్యంగా బ్యాటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ( కొన్ని మొబైల్స్ కు మాత్రమే ).

2.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి మొబైల్ కూడా 10 వాట్స్ నుంచి ఆపై 15w, 20w, 30w, 33w, 50w..ect ఇలా చార్జర్ ఇన్ పుట్ కెపాసిటీని పెంచుతూ మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. దాంతో కొన్ని మొబైల్స్ 30 నిమిషాల నుంచి గంటన్నర వ్యవదిలోనే ఫుల్ చార్జ్ అవుతున్నాయి. కానీ చాలా మంది రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. ( కొన్ని మొబైల్స్ కు మాత్రమే ). ఎందుకంటే మొబైల్ బ్యాటరీ ఫుల్ అయిన తరువాత చార్జింగ్ ఇన్ పుట్ తీసుకోవడం ఆపేస్తుంది. కానీ చార్జర్ రిమూవ్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల మొబైల్ హీట్ ను జనరేట్ చేసే అవకాశం ఉంది.

3.ఇలా రాత్రంతా చార్జింగ్ ఇన్ పుట్ లో ఉన్న మొబైల్స్.. వాటి బ్యాటరీ పై ప్రభావం చూపి పేలిపోయే అవకాశం కూడా ఉంది.

కాబట్టి మొబైల్ ను వీలైనంతా వరకు రాత్రంతా చార్జింగ్ పెట్టడం మంచిది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. మక్సిమమ్ మొబైల్ చార్జర్ కు ఇస్తున్న వాట్స్ ప్రకారం టైమ్ కేటాయించి మొబైల్ కు చార్జింగ్ పెట్టాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: మొబైల్ లాక్ మర్చిపోతే ఇలా చేయండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -