Thursday, May 2, 2024
- Advertisement -

చలికాలంలో జలుబు కు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి !

- Advertisement -

చలికాలం వచ్చేసింది…. రోజురోజుకూ చలితీవ్రతలు పెరుగుతున్నాయి… వాతావరణంలో చోటు చేసుకునే ఈ చలిగాలుల కారణంగా సహజంగానే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చలికాలంలో జలుబు, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అయితే చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో జలుబు సమస్య సర్వసాధారణం. అయితే జలుబు ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా జాగ్రత్తలు తీసుకోవాలి… మరి జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు త్వరగా తగ్గిపోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం !

  • పావు టీ స్పూన్ తేనె ను మిరియాల పొడితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
  • వేడి నీటిలో పసుపు పొడి వేసుకొని ఆవిరి పట్టడం వల్ల కూడా జలుబు త్వరగా తగ్గిపోతుంది.
  • వేడి నీటిలో అల్లం ముక్కలు ఉడికించి ఆ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లో తీసుకొని, ఒక స్పూన్ చక్కర వేసి ఆ మిశ్రమాన్ని తరచూ తాగడం వల్ల కూడా జలుబు కు చెక్ పెట్టవచ్చు.
  • అలాగే మిరియాలు, దానియాలు కలిపిన మిశ్రమాన్ని కాషాయంగా తీసుకున్న కూడా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • తేనెలో అల్లం కలుపుకొని తరచూ తీసుకుంటే కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలను నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఆకలి వేయడం లేదా.. అయితే ఇలా చేయండి !

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

లాప్ టాప్ ఓవర్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -