Monday, April 29, 2024
- Advertisement -

రక్తదానం చేయడం వలన ప్రయోజనాలు!

- Advertisement -

క్రమంగా రక్తదానం చేయటం వలన రక్తంలో ఐరన్ స్థాయిలు నిర్ణీతంగా ఉంచబడతాయి, ముఖ్యంగా పురుషులలో. దీని వలన గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు. శరీర విధులు సరైన విధంగా నిర్వహించటానికి గానూ, ఐరన్ మూలకం అవసరమే మరియు రక్తంలో ఐరన్ స్థాయిలు పెరిగిన పిదప, శరీర భాగాలు ఆక్సీకరణం చెంది, ప్రమాదానికి గురవుతాయి. ఈ ప్రమాదాల వలన గుండెపోటు, గుండె వైఫల్యానికి గురవటం వంటివి కలగవచ్చు.

ఒకసారి రక్తదానం చేయటం వలన 650 క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. ఫలితంగా, మీ శరీర బరువు తగ్గటమే కాకుండా, బరువు నియంత్రించబడుతుంది. కానీ, రక్తదానాన్ని రెండు లేదా మూడు నెలలకు ఒకసారి మాత్రమే చేయాలి. తరచుగా రక్తదానం చేయటం కూడా ఆరోగ్యానికి హానికరం. నిజానికి, రక్త దానం అనేది, మీ ఆరోగ్యం, రక్తంలోని హిమోగ్లోబిన్ శాతం మారియు ఐరన్ స్తాయిలపై ఆధారపడి ఉంటుంది.

Also Read: ఈ పాపాలు చేస్తే.. నరకానికే వెళ్తారంటా!!

రక్తదానం చేయటం వలన, జీవితకాలం పెరుగుతుంది. ”హెల్త్ సైకాలజీ” వారు పరిశోధనలు జరిపి, రక్తదానంలో తరచుగా పాల్గొనేవారు, వారి జీవితకాలానికంటే 4 సంవత్సరాలు కాలం పాటూ, ఎక్కువ జీవించారని తెలిపారు. కావున మీరు కూడా రక్తదానాన్ని చేస్తూ, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ, జీవితకాలాన్ని పెంచుకోండి.

ఇలా రక్తదానం చేయటం వలన మీ జీవితకాలం, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మరొక వ్యక్తి జీవితాన్ని కాపాడినవారు అవుతారు. కావున ఇలాంటి కార్యాలలో పాల్గొని మీ వంతు విధిని నిర్వహించి, తోటివారికి ఆదర్శప్రాయంగా నిలవండి.

Also Read: కలలో ఇవి కనిపిస్తే.. త్వరలోనే ధనవంతులు అవుతారని అర్ధమట!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -