Thursday, May 2, 2024
- Advertisement -

బరువు తగ్గడానికి చిట్కాలు..

- Advertisement -

అధిక బరువు తగ్గించడానికి బాడీ మెటబాలిజక్ రేటు(ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ది యూనివర్శిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన కొన్ని పరిశోధనల ప్రకారం…. కొన్ని రకాల హ్యాబిట్స్ తో మన బరువును కంట్రోల్ చేయడం అత్యంత శులభమని చెబుతున్నారు. ఇందుకుగాను మార్నింగ్ … కొద్ది పాటి వ్యాయామంతో పాటు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

మార్నింగ్ అందరూ చేయాల్సిన పనులు..

  1. లేచినవెంటనే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. దీని వలన శరీంలోని మలినాలు బయటకు తన్నేసి, బాడీలోని కొవ్వు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దోహదపడుతుంది.
  2. నిత్యం…. 15 నుంచి 20 నిముషాల పాటు ఎండలో ఉంటే మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది.అది బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
  3. ఉదయం 30 నిముషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వలన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కచ్చితంగా కరుగుతుంది.
  4. వ్యాయామం చేశాక ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. దీని వలన మన జీర్ణవ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.
  5. ఉదయం టీకు బదులు గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తాయి.
  6. ఉదయం కొద్దిసేపు మెడిటేషన్ చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -