Friday, May 3, 2024
- Advertisement -

డీ వివిలియ‌ర్స్ సంచ‌న‌ల నిర్ణ‌యం…

- Advertisement -

గతేడాది దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. ఇప్పుడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీ కి సంబంధించి ఏబీ డివిలియర్స్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక వన్డే జట్టు పగ్గాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.

టెస్టుల్లో, టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా ఉంటున్న డుప్లెసిస్‌కే వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తే బాగుంటుందని అతను స్వయంగా తమ దేశ క్రికెట్‌ బోర్డుకు విన్నవించడం విశేషం. వన్డే జట్టు కెప్టెన్సీ వదిలేస్తున్న సమయంలోనే తాను టెస్టుల్లోకి పునరామగనం చేయబోతున్నట్లు కూడా డివిలియర్స్‌ వెల్లడించడం విశేషం. మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల ఒత్తిడి ఎక్కువవుతోందని భావించిన ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని గత ఏడాది జనవరి నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని గత ఏడాది జనవరి నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. రెండు నెలల కిందట డివిలియర్స్‌ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు టెస్టుల్లో డుప్లెసిస్‌ నాయకత్వంలో ఆ జట్టు నిలకడగా సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తనంతట తానుగా వన్డే పగ్గాలు వదిలేసి, డుప్లెసిస్‌కే ఆ బాధ్యతలూ అప్పగించాలని బోర్డును కోరాడు డివిలియర్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -