Saturday, April 27, 2024
- Advertisement -

విజ‌యం ఊరించి టై గా ముగిసిన మ్యాచ్‌…

- Advertisement -

ఆసియాక‌ప్ భార‌త్‌-ఆఫ్ఘ‌న్ మ‌ద్య జరిగిన సూపర్-4 మ్యాచ్ ఉత్కంఠంగా సాగి చివ‌రికి టైగా ముగిసింది. చివరల్లో జడేజా ఫోర్ కొట్టి భారత శిబిరంలో ఆశలు రేపినా చివరి ఓవర్ ఐదో బంతికి ఆల్ రౌండర్ జడేజా ఔటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలో రాణించినా ఆఖర్లో భారత్‌ తడబడింది.నిర్ణీత 50 ఓవర్లలో అప్ఘానిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్, రాయుడు శుభారంభాన్ని అందించినప్పటికీ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన భారత ఆటగాళ్లలో దినేష్ కార్తిక్ తప్ప ఎవరూ వికెట్ల వద్ద నిలదొక్కుకోలేకపోయారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహ్మద్‌ షెహజాద్‌ 124 (116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు), మహ్మద్‌ నబీ 64 (116 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు. జడేజాకు మూడు, కుల్దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో సరిగ్గా 252 పరుగులకు ఆలౌటయింది. దినేశ్‌ కార్తీక్‌ (44), జడేజా (25) ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ షెహజాద్‌కు దక్కింది.

253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఓపెనర్లు రాహుల్, రాయుడు సిక్సర్లతో చెలరేగారు. రాహుల్ 55 బంతుల్లో, రాయుడు 43 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన రాయుడు (57) క్యాచ్ ఇచ్చి అవుటవగా, ఆ తర్వాత కాసేపటికే రాహుల్ (60) కూడా అవుటయ్యాడు.

ఆ తర్వాత ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. ధోనీ(8), పాండే (8), జాదవ్‌ (19) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకుని భారత శిబిరంలో ఆశలు పెంచిన కార్తీక్ (44) కూడా అవుటవడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు చేరుకుంది. చివరి రెండు బంతుల్లో భారత్ విజయానికి ఒక పరుగు అవసరం కాగా, చివరి ఓవర్ ఐదో బంతికి జడేజా ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ టైగా ముగిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -