Sunday, April 28, 2024
- Advertisement -

వైసీపీకి రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన రాయుడు!

- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు పరిధిలో కొంతకాలంగా సేవా కార్యక్రమాల పేరుతో బిజీ పర్యటించారు. ఇక గతేడాది డిసెంబర్‌లో తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే పార్టీలో చేరిన నెల రోజుల్లోనే తాను యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ నేతలు రాయుడు అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తూ లబ్ది పొందే ప్రయత్నం చేశారు.

దీంతో తాను వైసీపీకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చేశారు రాయుడు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన రాయుడు… జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను…. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదని అందుకే యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం అయ్యానని మరింత క్లారిటీ ఇచ్చేశారు.

దీంతో వైసీపీలో చేరినవారు వారం రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేకపోతున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి రాయుడు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -