Thursday, May 2, 2024
- Advertisement -

మ్యాక్స్‌వెల్ సెంచరీ..ఆసీస్ గెలుపు

- Advertisement -

టీమిండియాతో జరిగిన మూడో టీ 20లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 225 పరుగులు చేసింది. ఒకానొక దశలో వెంటవెంటనే మూడు వికెట్లు కొల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఆసీస్‌ను గట్టెక్కించారు మాక్స్‌వెల్. అదిరే సెంచరీ మ్యాక్స్‌వెల్ రాణించారు. మ్యాక్స్‌వెల్‌ 48 బంతుల్లో 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో 104 నాటౌట్‌గా నిలవగా ట్రావిస్‌ హెడ్‌ (35), కెప్టెన్‌ వేడ్‌ (28 నాటౌట్‌)రాణించడంతో ఆసీస్ గెలుపు ఖాయమైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదిరే సెంచరీతో భారత్ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. గైక్వాడ్ 57 బంతుల్లో 7 సిక్స్‌లు, 13 ఫోర్లతో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా సూర్యకుమార్ 39,తిలక్ వర్మ 31 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 222 పరుగులు చేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగా భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -