Thursday, May 9, 2024
- Advertisement -

మిథాలీ రాజ్ దెబ్బ‌కు కోచ్ ప‌ద‌వి ఊష్‌..!

- Advertisement -

భారత మహిళల జ‌ట్టులో ఎప్పుడు లేనంత‌గా తీవ్ర సంక్షోభంలో ఉంది. టీం ఇండియా వ‌న్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌ను టీ-20 ప్ర‌పంచ క‌ప్ సెమీస్‌లో తీసుకోక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.కోచ్ ర‌మేశ్ ప‌వార్ ఓ నియంత‌లా వ్య‌వ‌హారించి మిథాలీని జ‌ట్టు నుంచి దూరం చూశాడు.దాదాపు 20 సంవ‌త్స‌రాల నుంచి ఇండియ‌న్ టీంకు సేవ‌లు అధిస్తున్న ఆమెను ఇలా చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.దీంతో బీసీసీఐ ర‌మేశ్ పవార్‌ను కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారని తెలుస్తుంది.ఎలాంటి చర్యలు లేకుండానే, ఎవరు జోక్యం చేసుకోకుండానే అతని కోచింగ్‌కు తెరపడింది!

ఎలాగంటే…ఈ మాజీ స్పిన్నర్‌ను కేవలం మూడు నెలల కాలానికే కోచ్‌గా నియమించారు. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. బీసీసీఐ తాజాగా కొత్త కోచ్‌ నియామక ప్రక్రియను ప్రారంభించింది. మిథాలీ రాజ్ దెబ్బ‌కు ర‌మేశ్ ప‌వార్ పేరును కోచ్ ప‌ద‌వికి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు బీసీసీఐ.హర్మన్, మిథాలీల మధ్య సఖ్యతపై బీసీసీఐ మాత్రం సానుకూల దృక్పథాన్ని ప్రకటించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -