Wednesday, May 8, 2024
- Advertisement -

సచిన్‌, గంగూలిల‌కు బీసీసీఐ అంబుడ్స్ మ‌న్ క‌మిటీ నోటీసులు..

- Advertisement -

బీసీసీఐలో జోడు ప‌దువుల వ్య‌వ‌హారం హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్ప‌టికే క్రికెట్ అడ్వైజరీ కమిటీ(CAC)లో సభ్యులుగా ఉంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెంటర్స్‌(సలహాదారులు)గా ఉండటంపై గంగూలికి నోటీసులు జారీచేసిన అంబుడ్స్ మ‌న్ క‌మిటీ తాగా మ‌రో ఇద్ద‌రు సంభ్యులు స‌చిన్‌, ల‌క్ష్మ‌న్ ల‌కు కూడా నోటీసులు జారీచేశారు జస్టిస్ డి.కె.జైన్ నోటీసులు జారీ చేశారు.

క్రికెట్ అడ్వైజరీ కమిటీలో (CAC) సభ్యులుగా ఉంటూ… ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మెంటర్స్‌ (సలహాదారులు)గా ఉండటంపై అభ్యంతరం చెబుతూ, ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు పంపారు. వాస్తవానికి బీసీసీఐకు సేవలందిస్తోన్న సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. అయినప్పటికీ నోటీసులు అందుకోవడం గమనార్హం.

ప్రస్తుతం టెండుల్కర్… ముంబై ఇండియన్స్‌కి మెంటర్‌ (నమ్మకమైన సలహాదారు)గా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి లక్ష్మణ్ మెంటర్‌గా ఉన్నాడు. భారత జట్టుకు కోచ్‌ నియామకంతో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాల కోసం బీసీసీఐ కొన్నేళ్ల కిందట సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు. ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉన్న స‌చిన్‌, గంగూలి, ల‌క్ష్మ‌ణ్ లు ఎటువంటి జీతాలు తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తున్నారు.

సచిన్ టెండుల్కర్, లక్ష్మణ్ ఇద్దరూ తన నోటీసులపై ఏప్రిల్ 28 కల్లా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు జస్టిస్ జైన్. బీసీసీఐ కూడా తన స్పందన తెలపాలని కోరారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) సభ్యుడైన సంజీవ్ గుప్తా వేసిన కంప్లైంట్‌పై స్పందిస్తూ జైన్ ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సచిన్, లక్ష్మణ్ ఈనెల 28లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -