Thursday, May 9, 2024
- Advertisement -

భారీగా పెరిగిన సెల‌క్ట‌ర్లు, అంపైర్ల జీతాలు….

- Advertisement -

భారత జట్టు సెలక్టర్లు, అంపైర్ల, జీతాలు భారీగా స్కోరర్లు, వీడియో విశ్లేషకుల జీతాలు భారీగా పెరగనున్నాయి. వీరి వేత‌నాల పెంపుపై సాబాకరీం నేతృత్వంలోని బీసీసీఐ కమిటీ ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిని చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్‌ గాంధీ, శరణ్‌దీప్‌ సింగ్‌ సేవలకు ప్రతిఫలంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఏడాదికి రూ. 80 లక్షలు జీతంగా అందుకుంటుండగా.. కమిటీలోని సెలక్టర్లకి రూ. 60 లక్షలు అందుతోంది. తాజా పెంపుతో ఇకపై ఎమ్మెస్కే ప్రసాద్ రూ. కోటి, సెలక్టర్లు రూ. 75-80 లక్షలు అందుకోనున్నారు. దీంతోపాటు ఆరేళ్ల తర్వాత రిఫరీలు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల దేశవాళీ మ్యాచ్‌ ఫీజులను పెంచారు.

ఫస్ట్‌క్లాస్, మూడు రోజుల, 50 ఓవర్ల మ్యాచ్‌కు ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా దానిని రెట్టింపు చేశారు. టి20 మ్యాచ్‌ ఫీజు రూ.10 వేలు ఉండగా రూ.20 వేలు ఇవ్వనున్నారు. రిఫరీలకు నాలుగు రోజుల మ్యాచ్‌కు రూ.30 వేలు, మూడు రోజుల, ఒక రోజు మ్యాచ్‌కు రూ.15 వేలు అందజేస్తారు. స్కోరర్లకు రూ.10 వేలు, వీడియో విశ్లేషకులకు ఇతర మ్యాచ్‌లకు రూ.15 వేలు, టి20లకు రూ.7,500 ఇస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -