Thursday, May 2, 2024
- Advertisement -

U-19 వరల్డ్ కప్‌ని తీసుకొచ్చిన ద్రవిడ్‌ని ఘోరంగా అవమానించిన బిసిసిఐ

- Advertisement -

వందల వేల కోట్ల స్థాయికి ఎదిగిపోతున్న బిసిసిఐకి ఎప్పుడూ కూడా జెంటిల్‌మేన్ తరహాలో ఉండేవాళ్ళంటే చిన్నచూపే. రాజకీయ బలం, సొంత ఇమేజ్ కోసం పాకులాడేవాళ్ళు, కోట్లుకు కోట్లు కొల్లగొట్టడం కోసం మాత్రమే క్రికెట్‌లోకి, బిసిసిఐలోకి వచ్చేవాళ్ళకు మాత్రం అక్కడ సింహాసనాలు దక్కుతూ ఉంటాయి. క్రికెట్ కోసం ప్రాణాలిచ్చినవాళ్ళకు, ఆ స్థాయిలో కష్టపడిన వాళ్ళకు మాత్రం కనీసం స్థానం కూడా ఉండదు. సర్వం తానే అయి…..ప్రాణాలకు తెగించి కష్టపడి……50కి పైగా ఆపరేషన్స్‌కి గురైన కపిల్ దేవ్ భారతదేశానికి 1983వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. ఇండియాలో క్రికెట్‌కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి ఆ గెలుపే కారణం. బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా, కెప్టెన్‌గా కపిల్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. కానీ ఆ తర్వాత క్రమంలో క్రికెట్‌కి క్రేజ్ వచ్చి కోట్లకు కోట్లు వచ్చిన ఆదాయంలో మాత్రం కపిల్‌కి జీరోనే మిగిలింది. కనీసం క్రికెట్ బోర్డ్‌లోనే లేకుండా పోయాడు. అన్నింటికీ మించి పెన్షన్ తరహా వ్యవహారాలు కూడా కపిల్‌కి దక్కకుండా చేశారు….ఈ రోజుకీ అన్యాయం చేస్తూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు రాహుల్ ద్రవిడ్‌ని కూడా ఘోరంగా అవమానించింది బిసిసిఐ. ఆట ఆడుతున్న సమయంలో కూడా కుంబ్లే, ద్రవిడ్‌‌లాంటి జెంటిల్ మేన్ తరహా వ్యక్తులను అవమానించడం బిసిసిఐకి అలవాటే. తాజాగా అండర్ 19 ప్రపంచకప్‌ని భారత్ గెల్చుకోవడంలో అన్నీ తానై కీలక పాత్ర పోషించిన ద్రవిడ్‌కి 50లక్షలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర సహాయకులకు మాత్రం 20 లక్షలు ప్రకటించారు. ఆ విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన ద్రవిడ్……వాళ్ళు కూడా నాతో సమానంగా కష్టపడ్డారని……అందరికీ సమాన నజరానా ఇవ్వాలని కోరాడు. ద్రవిడ్ మంచి మనసును క్రీడాభిమానులు వేనోళ్ళ పొగిడారు. కానీ బిసిసిఐ మాత్రం కుట్ర, కుతంత్రాల తరహాలో ఆలోచించింది. ద్రవిడ్‌కి ఇస్తామన్న యాభై లక్షల్లో నుంచి పాతిక లక్షలు తీసేసి……ఆ పాతిక లక్షలనూ ద్రవిడ్ సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికీ ఐదు లక్షల చొప్పున పంచింది. ఆ రకంగా ద్రవిడ్‌తో సహా అందరికీ సమానంగా పాతిక లక్షలు ఇస్తున్నామని చెప్పింది బిసిసిఐ.
వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న బిసిసిఐ ద్రవిడ్‌ విషయంలో నీచంగా ప్రవర్తిస్తూ…..ఘోరంగా అవమానించడంపై ఇప్పుడు క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐపై దుమ్మెత్తిపోస్తు్నారు. ద్రవిడ్‌పై అభిమానం కురిపిస్తున్నారు. అయినప్పటికీ బిసిసిఐలో మార్పు వస్తుందంటారా? ఎందుకంటే అక్కడున్న వాళ్ళకు కాసుల లెక్కలు మాత్రమే బాగా తెలుసు…….క్రికెట్ కోసం పడుతున్న కష్టంగానీ, ఎమోషన్స్ కానీ, ఎథిక్స్ కానీ అస్సలు తెలియకుండాపోతున్న పరిస్థితి. బోర్డ్ పెద్దల్లో ఎక్కువమంది అవినీతికి బాగా అలవాటుపడిన రాజకీయ, వ్యాపర జీవులే కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -