Thursday, May 2, 2024
- Advertisement -

భాజాపాలో చేరిన వెస్టీండీస్ స్టార్ ఆట‌గాడు…?

- Advertisement -

ప్ర‌తి ఒక్క‌రికి సోష‌ల్ మీడియా ప్ర‌ధాన అస్త్రం అయ్యింది. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఎలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా సామాజిక మాధ్య‌మాల ద్వారా వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్య మాల‌ను మంచికంటె చెడుగానె ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఎక్కువ‌గా అబ‌ద్ద‌పు వార్త‌ల‌ను మార్పింగ్ పోటోల‌తో ప్రచారం చేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. వెస్టీండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్ గేల్ భాజాపాలో చేరార‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంకూడా చేయ‌నున్నార‌నే వార్త‌ల సామాజ‌కి మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. బీజేపీలో చేరిన క్రిష్ణ గోయల్ ఉరఫ్ క్రిస్ గేల్ అని మరో పోస్ట్ వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్ ధరించగా కాషాయ కండువా ధరించినట్లుగా ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఇదంతా ఉత్తుత్తిద‌ని తేలిపోయింది. క్రిస్‌గేల్ బీజేపీలో చేరడం గానీ, లేక ఆ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నాడన్నది అబద్ధాలు మాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో గేల్ బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నాడని కనీసం ఒక్క మీడియా గాని, భాజాపా నేత‌లు గాని ఎక్క‌డా చెప్ప‌లేదు. నిజంగానే గేల్ బీజేపీకి మద్దతిస్తున్నారని భావించి నెటిజన్లు క్రిస్ గేల్ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -