Wednesday, April 24, 2024
- Advertisement -

ఆత్మహత్య చేసుకున్న భారత మాజీ క్రికెటర్ …

- Advertisement -

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, మాజీ సెలక్టర్‌ వీబీ చంద్రశేఖర్‌(58) గురువారం అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో విగతజీవిగా కనిపించగా, పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. 57 ఏళ్ల చంద్రశేఖర్, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్‌ తరఫున 1988 నుంచి 1990 కాలంలో ఏడు వన్డేలాడిన చంద్రశేఖర్‌ 88 పరుగులు చేయగా జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మొత్తం 81 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 4999 పరుగులు చేయడంతో పాటు అత్యుత్తమ స్కోర్‌ 237 (నాటౌట్‌)సాధించాడు.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీమ్ ‘వీబీ కంచి వీరన్స్’ ఏర్పాటైన తరువాత ఆయనపై రుణభారం పెరిగినట్టు తెలుస్తోంది. కేసును విచారిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

చంద్రశేఖర్ మరణవార్త క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. బీసీసీఐతో పాటు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ం సురేశ్ రైనా తదితరులు సంతాపం తెలిపారు. అంతేకాదు పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు.తమిళనాడు క్రికెట్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు ఆయన ఎనలేని సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. మాజీ కీపర్‌ దీప్‌దాస్‌గుప్తా సైతం చంద్రశేఖర్‌ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయనతో 20 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -