Thursday, May 9, 2024
- Advertisement -

పాక్ ,ఇండియా మ్యాచ్‌ల‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

భార‌త్‌, పాక్ ల మ‌ధ్య మెరుగైన స‌స్సంబంధాలు లేక పోవ‌డంతో ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్‌లు జ‌ర‌గ‌డంలేద‌న్న సంగ‌తి తెలిసిందే. భార‌త్‌లో మ్యాచ్‌లు ఆడాల‌ని పీసీబీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కేంద్రంమాత్రం అనుమ‌తి ఇవ్వ‌డంలేదు. ఇరు దేశాల‌మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల విష‌యంలో పాక్ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దాదాపు పదేళ్లుగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి వెనకడుగు వేస్తున్న టీమిండియాతో మ్యాచ్‌ల విషయాన్ని ఇక మరచిపోతేనే బాగుంటుదని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ సూచించాడు. ఈ విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) తమ ప్రయత్నం మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

గత దశాబ్దకాలంగా టీమిండియాతో మ్యాచ్‌లు ఆడించాల్సిందిగా బీసీసీఐను అడిగింది చాలని.. భారత్‌తో మ్యాచ్‌లు ఆడకపోతే పాక్‌లో క్రికెట్ చచ్చిపోతుందా.? అని ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఒప్పందం మేరకు 2015-2023 మధ్య కాలంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉంది. కానీ.. పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో దాయాది దేశంతో భారత్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఆసక్తి కనరబర్చడం లేదు.

టీమిండియాతో దైపాక్షిక సిరీస్‌లు గురించి ఇక ఆలోచన వద్దు. వారితో క్రికెట్‌ ఆడనంత మాత్రాన మన క్రికెట్‌కు ఏమీ నష్టం లేదు. పదేళ్లుగా మనతో భారత్‌ మ్యాచ్‌లు ఆడటం లేదు. మన క్రికెట్‌ ఏమైనా దిగజారిపోయిందా. లేదు కదా.. ఇందుకు చాంపియన్స్‌ ట‍్రోఫీనే ఉదాహరణ. అటువంటప్పుడు టీమిండియాతో మ్యాచ్‌లు కోసం పాకులాడటం అనవసరం’ అని మియాందాద్‌ తన స్వరాన్ని పెంచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -