Monday, May 27, 2024
- Advertisement -

సోయబ్ మాలిక్ కొట్టుడుకు స్టేడియంలో పగిలిన అద్దాలు….

- Advertisement -

ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్ అల్లుడు సోయబ్ మాలిక్ టీ20లలో కొనసాగుతున్నారు. తాజాగా జరుగుతున్న గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో వాంకోవర్‌ నైట్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న షోయబ్ మాలిక్ బ్రాంప్టన్ వోల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు.

మ్యాచ్ లో మాలిక్ కొట్టిన సిక్సర్లకి స్టేడియంలోని అద్దాలు పగిలిపోయాయి. మూడు సిక్సర్లు కొడితే అందులో రెండు రెండు బంతులు స్టేడియంలోని గ్యాలరీ అద్దాలకి తాకడంతో అవి చిత్తుగా పగిలిపోయాయి. గ్లోబల్‌ టి20 కెనడా లీగ్‌లో అతడీ విన్యాసం చేశాడు.

వాంకోవర్‌ నైట్స్‌ కెప్టెన్‌గా ఉన్న మాలిక్‌ గురువారం బ్రాంప్టన్‌ వోల్‌వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ చెలరేగాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వాంకోవర్‌ నైట్స్‌ …వర్షం కారణంగా కుదించిన 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ షోయబ్ మాలిక్ (46 నాటౌట్: 26 బంతుల్లో 4×4, 3×6), ఆండ్రీ రసెల్ (43: 21 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రాంప్టన్‌ టీమ్‌ 13.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మున్రో ఒక్కడే అర్ధ సెంచరీ(62)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాట్ష్ మెన్ లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 77 పరుగులతో బ్రాంప్టన్‌ వోల్‌వ్స్‌ ఓటమిపాలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -