Monday, April 29, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన సెల‌క్స‌న్ క‌మిటీ..

- Advertisement -

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు ఈరోజు జట్టుని ప్రకటించారు. గ‌త ఆరు నెల‌ల ప్రద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుక‌న్న సెలక్టర్లు.. అనుభవం, ప్రదర్శన ఆధారంగా 15 మందితో కూడిన టీమ్‌ని ఎంపిక చేశారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రితో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ టీమ్‌ని ప్రకటించారు. రెండో వికెట్ కీప‌ర్‌గా దినేష్ కార్తిక్‌, హార్ధిక్ పాండ్యాతో పాటు రెండో ఆల్ రౌండ‌ర్ గా విజ‌య్ శంక‌ర్ కు జ‌ట్టులో చోటు క‌ల్పించారు.

ప్రపంచకప్‌లో తలపడే భారత్ జట్టు …

విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు.. ఆ తర్వాత 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2011లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. జ‌ట్టులో యువ వికెట్ కీప‌ర్ ఇక రిష‌బ్ పంత్‌కి చోటు ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కాని సెల‌క్స‌న్ క‌మిటీ రిష‌బ్‌, రాయుడికి షాక్ ఇచ్చింది. వీరితో పాటు అశ్విన్ కు కూడా జ‌ట్టులో చోట ద‌క్క‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -