Thursday, May 2, 2024
- Advertisement -

సెమీఫైన‌ల్లో టాస్ ఓడిన టీమిండియా….

- Advertisement -

మ‌రి కొద్ది సేప‌ట్లో భార‌త్, న్యూజిలాండ్‌ల మ‌ధ్య మొద‌టి సెమీఫైన‌ల్ ప్రారంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో ఇవాళ తలపడనుంది. భారత తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని పక్కకి తప్పించి అతని స్థానంలో మరో స్పిన్నర్ చాహల్‌ని తీసుకున్నాడు. ఈ క్రమంలో రెండు జట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భారత్:
లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా.

న్యూజిలాండ్:

మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్‌టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషం, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ శాన్టనర్, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -