Monday, April 29, 2024
- Advertisement -

ఇండియా, న్యూజిలాండ్ సెమీస్‌కి వ‌ర‌ణుడు అడ్డుప‌డితే విజేత ఎవ‌రంటే…?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ మ‌రో బిగ్ స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లీగ్ ద‌శ‌ను ముగించుకొని సెమీపైన‌ల్స్ కు సిద్ద‌మ‌వుతోంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్తుల కోసం సెమీస్‌లో ఢీకొనబోతున్నాయి. లంకపై గెలిచిన టీమిండియా పాయంట్ల పట్టిక‌లో మొద‌టిస్థానంలో కొన‌సాగుతోంది.

లీగ్ దశ ఆరంభం నుంచి టోర్నీని వెంటాడుతున్న వరుణుడు.. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకి కూడా అడ్డు త‌గిలే ప‌రిస్థితిలు ఉన్నాయి. మాంచెస్టర్‌లోని ప్రఖ్యాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్‌-కివీస్‌ మధ్య ఇదే తొలిపోరు కానుంది. లీగ్‌ దశలో గత నెల 13న నాటింగ్‌హామ్‌లో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే.

సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకి రిజర్వ్ డే ఉంటుంది. మ్యాచ్‌ రోజు వర్షంతో ఆట సాధ్యంకాకపోతే.. మరుసటి రోజు మ్యాచ్‌ని నిర్వహిస్తాను. ఒకవేళ రెండు రోజులూ.. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యపడకపోతే మాత్రం.. లీగ్ దశలో అత్యధిక పాయింట్లతో నిలిచిన జట్టుని విజేతగా నిర్ణయిస్తారు. భార‌త్ పాయంట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉంది కాబ‌ట్టి సేఫ్‌జోన్‌లో ఉంది.

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం గండం పొంచి ఉంది. ఇక్కడ వర్షం పడే అవకాశాలు దండిగా ఉన్నాయని.. వరుసగా రెండు రోజులు వర్షం పడితే ఇంగ్లండ్‌ గుండె చెరువై.. ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -