Saturday, April 27, 2024
- Advertisement -

టెస్టుల్లో 5000 ప‌రుగుల క్ల‌బ్‌లో చేరిన‌ కోహ్లీ…

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 5 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నారు. శ్రీలంక‌తో ఢిల్లీలో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో 25 రన్స్ పూర్తి చేయగానే కోహ్లి ఈ ఘనత సాధించాడు. 105 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్ కూడా 105 ఇన్నింగ్స్‌ల్లోనే 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

భారత్ తరఫున వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడు కోహ్లి కావడం గమనార్హం. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన పదకొండో ఆటగాడు కోహ్లి కావడం విశేషం. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో పరుగులు చేస్తున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.

భారత్ తరఫున ఫాస్టెస్ట్ 5000 రన్స్ రికార్డ్ సునీల్ గావస్కర్ పేరిట ఉంది. లిటిల్ మాస్టర్ 95 ఇన్నింగ్స్‌ల్లోనే 5 వేల పరుగులు పూర్తి చేశాడు. సెహ్వాగ్ 99 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ 103 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుత క్రికెటర్లలో ఆసీస్ కెప్టెన స్టీవ్ స్మిత్ మాత్రమే కోహ్లి కంటే వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేశాడు. స్మిత్ 97 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్ చేరుకోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -