Friday, April 26, 2024
- Advertisement -

ఇంగ్లండ్‌తో టెస్టు.. క‌ష్టాల్లో టీమిండియా!

- Advertisement -

ఇంగ్లండ్‌తో చెన్నైలో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా క‌ష్టాల్లో కూరుకుపోయింది. మూడో రోజు ఆట ముగిసే స‌రికి 6 వికెట్లు కోల్పోయి 74 ఓవ‌ర్ల‌లో 257 ప‌రుగులు చేసింది. ఇంగ్లిష్ బౌల‌ర్ డామ్ బెస్ ధాటికి భార‌త బ్యాట్్స‌మెన్ చేతులెత్తేశారు. పుజారా, కోహ్లి, ర‌హానే, పంత్ వికెట్లు కూల్చి అత‌డు 4 కీల‌క వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌రో బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ రెండు వికెట్లు తీశాడు.

ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ(6)‌, శుభ్‌మ‌న్ గిల్(29) నిరాశ ప‌ర‌చ‌గా, పుజారా(73), పంత్‌(91) నిల‌క‌డ‌గా ఆడ‌టంతో భార‌త్ 250 ప‌రుగుల మార్కును దాట‌గ‌లిగింది. ఇక కెప్టెన్ కోహ్లి త‌న స్థాయికి తగ్గ‌ట్టు ఆడ‌లేదు. 48 బంతులు ఎదుర్కొని కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఇక వైస్ కెప్టెన్ ర‌హానే మ‌రీ ఘోరం, 11 బంతుల్లో కేవ‌లం ఒకే ఒక్క ర‌న్ చేశాడు. ప్ర‌స్తుతం వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(33), అశ్విన్‌(8) బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ డ‌బుల్ సెంచ‌రీతో మెర‌వ‌గా , ప‌ర్యాట‌క జ‌ట్టు 578 ప‌రుగుల‌తో తొలి ఇన్నింగ్్స ముగించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు టీమిండియా ఇంకా 321 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. నాలుగు వికెట్లు మాత్ర‌మే చేతిలో ఉన్నాయి. దీంతో నాలుగో రోజు ఆట మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారనుంది.

నిమ్మ‌గ‌డ్డ‌కు పిచ్చి బాగా ముదిరింది!

పసుపు తో ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు!

ఆస‌క్తిని పెంచుతున్న ప‌వ‌న్ పీరియాడిక్ మూవీ !

కోహ్లి గ్రేట్‌నెస్‌.. వీడియో షేర్ చేసిన ఐసీసీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -