Tuesday, May 7, 2024
- Advertisement -

శిఖ‌ర్ ధావ‌న్‌లో స్పీడు త‌గ్గిందా…? ఇంత నిర్ల‌క్ష్య‌మా….?

- Advertisement -

మైదానంలో వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో రోహిత్ శర్మ తర్వాత ఎక్కువ తడబడే బ్యాట్స్‌మెన్ ఓపెనర్ శిఖర్ ధావన్. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లోనే అతను రెండు సార్లు పేలవ రీతిలో రనౌటయ్యాడు. ముఖ్యంగా షాట్ కొట్టిన తర్వాత బంతి గమనాన్ని పసిగట్టడంలో ధావన్ బలహీనత స్పష్టంగా బయటపడుతోంది.

సాధారణంగా బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టిన వెంటనే బంతి గమనంతో సంబంధం లేకుండా రెండు అడుగులు క్రీజు వెలుపలకి వెళ్లి.. పరుగు తీసే అవకాశం ఉంటే ముందుకు వెళ్తాడు. లేదంటే వెనక్కి వచ్చేస్తాడు. కానీ.. ధావన్‌ దీనికి పూర్తిగా విరుద్ధం. అతను బంతిని చూసిన తర్వాత.. పరుగు కోసం ప్రయత్నిస్తాడు. దీంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ సగం దూరం వచ్చే వరకూ ధావన్ క్రీజులోనే ఉండిపోతున్నాడు.

దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ ఇదే తరహాలో తడబడ్డాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్ వేసిన స్పిన్నర్ షంసీ బౌలింగ్‌లో డీప్ మిడ్‌ వికెట్ దిశగా బంతిని తరలించిన శిఖర్ ధావన్ (47: 40 బంతుల్లో 3×4) తొలి పరుగు పూర్తి చేసి.. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. ఇక్కడ రెండో పరుగుకి అవకాశం ఉన్నా.. ధావన్ వేగంగా పరుగెత్తలేకపోయాడు. ఎందుకంటే.. అతను పరుగుని ఆలస్యంగా ఆరంభించాడు. దీంతో.. డీప్‌ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ జూనియర్ డాలా నేరుగా బంతిని వికెట్లపైకి విసరడంతో ధావన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -